పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నేడు పుట్టిన రోజు ను జ‌రుపు కుంటున్నాడు. ఈ ఏడాది తో ప్ర‌భాస్ 42 వ వ‌య‌స్సు లోకి అడుగు పెట్టాడు. దీంతో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను అభిమానులు జ‌రుపు కుంటున్నారు. ప‌లువురు తార‌లు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌భాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ముఖ్యంగా అనుష్క ప్ర‌భాస్ కు శుభాకాంక్ష‌లు చెబుతు సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చాలా వైరల్ అయింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు చెప్పింది. అలాగే ప‌లువురు డైరెక్ట‌ర్లు, హీరోలు, ప్రొడ్యూస‌ర్లు కూడా త‌మ శుభాకాంక్ష‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌భాస్ కు తెలిపారు.



అలాగే పాన్ ఇండియా స్టార్ అభిమానులు కూడా ట్టిట్ట‌ర్ లో త‌మ శుభాకాంక్ష‌ల పోస్టు ల‌తో హోరేత్తిస్తున్నారు. #HappyBirthdayPrabhas అనే హ్యాష్ ట్యాగ్ తో వేల సంఖ్య లో ట్వీట్ ల‌ను పెడుతున్నారు. అలాగే ప్ర‌భాస్ ప్రస్తుతం న‌టిస్తున్న సినిమా పేర్ల తో కూడా ట్వీట్స్ చేస్తున్నారు. #ProjectK #Salaar #Adipurush అనే హ్యాష్ ట్యాగ్ ల‌తో ట్వీట్ట‌ర్ లో దుమ్ము దులుపుతున్నారు. #HappyBirthdayPrabhas  తో ప్ర‌స్తుతం 600K ట్వీట్ లతో ట్రెండింగ్ లో రెండో స్థానం ఉంది. అలాగే ప్ర‌భాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్. సినిమా కు సంబంధించిన టీజ‌ర్ ను ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ కూడా ట్రెండింగ్ లో ఉంది. అలాగే ఈ టీజ‌ర్ యూట్యూబ్ విడుద‌ల అయిన కొద్ది స‌మ‌యంలో నే 1 మిలియ‌న్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగు ట్వీట్ట‌ర్ లో #RadheShyamTeasar హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ ఏకంగా మొద‌టి స్తానం లో ఉంది. ఈ ట్యాగ్ మీద 70K ట్వీట్లు వ‌చ్చాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: