గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి  లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో వరదలకు చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా గ్రామాలు నీటిలో కొట్టుకుపోయి కొన్ని వేల మంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వర్షాభావ పరిస్థితులతో పాడి పంటలతో పాటుగా, వారి నివాస గృహాలు విలువైన వస్తువులు కూడా నీటిలో కొట్టుకుపోవడం ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరద ఉధృతికి చాలామంది ప్రజలు బ్రతికితే చాలనుకుని పొట్ట చేతబట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాయలసీమ  పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారు అయింది. ఇక రాయలసీమ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. వరదల ధాటికి చాలామంది ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డారు. తిండి తిప్పలు లేకుండా సహాయం  కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత అల్లకల్లోలం జరుగుతున్నా సీమను వరదలు ముంచెత్తుతున్నా వారికి మాత్రం చీమకుట్టినట్లు కూడా అనిపించడంలేదు. సీమ పేరుతో ఎన్నో సినిమాలు తీసి, ఎంతో పేరు సంపాదించుకొని దర్జాగా బతుకుతున్న ఆ మహానుభావులకు  సీమ  కష్టాలు కనిపించడం లేదా.. సినిమాల్లోనే కష్టాలను తీరుస్తారా..!

 సీమ ప్రజలను సినిమాల వరకే వాడుకోవడానికి పరిమితం చేస్తారా.. వారి కష్టం వస్తే ఆదుకునే పరిస్థితి మీకు లేదా.. సినిమాల్లో అయితే మా హీరో వచ్చి మమ్మల్ని ఆదుకుంటాడని ఎదురు చూసి చివరికి ఆ హీరోనే వారిని ఎలాగోలా ఆదుకొని వారి సమస్య పరిష్కారం చూపుతాడు. రియల్ లైఫ్ లో రాయల్ గా బతికే రాయలసీమకు రంది వచ్చిపడింది.. మరి వీరి బాధను సినిమాల్లో లాగా వచ్చి ఆదుకోవాలని ఆ రాయలసీమ ప్రజలు  కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. మా హీరోలు ఎప్పుడెప్పుడు వచ్చి ఆదుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నారు. రాయలసీమ యాసను భాషను నడవడిని వాడుకున్న మీకు కనీసం అక్కడి ప్రజలను ఆదుకునే ఆర్థిక పరిస్థితులు లేవా అని దేశవ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తున్నారు.  రంది పడుతున్నా రాయలసీమకు భరోసా ఇవ్వండి.. బతుకు దారి చూపండి.. రాయలసీమ మళ్లీ రతనాలసీమ అయ్యేలా  నడుం బిగించండి.. రేపటి మీ భవిష్యత్తుకు రాయలసీమ పునాది అని భావించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: