గత మూడు రోజులుగా బిగ్ బాస్ లో ఎమోషన్ ల  ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. కంటెస్టెంట్ లకు సంబంధించిన ఫ్యామిలీలు హౌస్ లోకి వచ్చారు.దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్స్ లో కూడా కంటెస్టెంట్స్ కి బాగా కావాల్సిన వాళ్లు వచ్చి ఆశ్చర్యపరిచారు. ఇక మొన్న టి ఎస్ ఆర్ లో సిరి మదర్ రాగా  నిన్నటి ఎపిసోడ్ లో సిరి ప్రియుడు శ్రీహాన్ వచ్చాడు. అయితే కంటెస్టెంట్స్ వాళ్లకి విలువైన వస్తువులను త్యాగం చేస్తేనే వాళ్ళ కోసం స్పెషల్ పర్సన్స్ వస్తారని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా వారికి బాగా ఇష్టమైన వస్తువులను ఇచ్చేయడంతో వాళ్ల కోసం స్పెషల్ పర్సన్స్ వచ్చారు. దీంతో సిరి తనకు కాబోయే భర్త శ్రీహాన్ కానుకగా ఇచ్చిన బ్రేస్లెట్ ని త్యాగం చేసింది. ఆ తర్వాత శ్రీహాన్ స్టేజి మీదకు వచ్చాడు. చాన్నాళ్ల తర్వాత ప్రియుడు వస్తుండడంతో సిరి ఏడ్చేసింది. కనీసం తలెత్తి కూడా చూడలేదు. దీంతో శ్రీహాన్ నన్ను వదిలేస్తున్నావా అని అడగడం తో సిరి తప్పు చేసిన దానిలాగా గుంజీలు తీసింది. అది చూసి శ్రీహాన్ కూడా ఎమోషన ల్ అయ్యాడు. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటానని చెప్పగానే సిరి నవ్వింది. బాత్ రూమ్ లో తల బాదుకుని ఎందుకు గోడలు పగలగొడుతున్నావు అని సరదాగా ఏడిపించాడు.

ఆ తర్వాత  సిరి వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతూ  శ్రీహాన్ షార్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు తన గెస్ట్ గా వెళ్లానని అక్కడ తన ప్రేమ కథకు పునాది పడింది అని చెప్పింది. ఇక సిరి పక్కన తాను లేకపోయినా ఆమెకు తోడుగా ఉంటూ రక్షిస్తున్నందుకు షణ్ముక్ కి థాంక్స్ చెప్పాడు శ్రీహాన్. ఆ తర్వాత సిరి ని ఏడిపించడానికి నీకో సీక్రెట్ చెప్పాలి అని అన్నాడు. నేనొకరిని ప్రేమిస్తున్నాను, రెండు రోజుల క్రితమే ప్రపోజ్ చేశాను, మెసేజ్ కూడా పెట్టాను అని చెప్పడంతో సిరి షాక్ అయింది. అయితే అటునుంచి థాంక్యూ శ్రీహాన్ మామ  అని రవి కూతురు వియా రిప్లై ఇచ్చిందని చెప్పడంతో అందరూ నవ్వేశారు. సిరి కోసం శ్రీహాన్ పాట కూడా పాడారు. చివరగా మీలో మీరు కొట్టుకు చావండి కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని చెప్పడంతో సిరికి జాగ్రత్త అని చెప్పి వెళ్లాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: