బాలీవుడ్ లో ఎందరో హీరోయిన్ లు నెమ్మదిగా తమ టాలెంట్ ను నిరూపించుకుని పైకి వస్తున్నారు. అటువంటి వారిలో ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురు ఆలియా భట్ ఒకరు. ఈమె 1993 మార్చ్ 15 న ముంబై లో జన్మించారు. మహేష్ భట్, సోని లు ఈమె తల్లితండ్రులు. అలియా కి రుజుల్ భట్ అనే సోదరుడు, షాహిన్, పూజ భట్ అనే సోదరీమణులు ఉన్నారు. ఈమె హీరోయిన్ గానే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కానీ ఈమె గొప్ప సింగర్, ఫ్యాషన్ డిజైనర్ కూడా కావడం గమనార్హం. 1999 లో సంగర్ష్ అనే బాలీవుడ్ మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఆ తర్వాత 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉండాలే కానీ హీరోయిన్ లకు సైతం భారీ రెమ్యునరేషన్  అందుతుందన్న విషయం తెలిసిందే. ఆలియా భట్ కూడా భారీగానే పారితోషికం అందుకుంటున్నారు. ఈమె ఒక్కో చిత్రానికి 22 కోట్లకు పైగానే రెమ్యునరేషన్, అలాగే పలు రకాల యాడ్స్ చేస్తూ 6 నుండి 7 కోట్ల వరకు అందుకుంటోంది. ఈమె మొత్తం ఆస్తి విలువ 80 కోట్లు. ఆలియా ముంబై లో నివసిస్తున్నారు ఈమె ఇంటి విలువ 20 కోట్లకు పైగానే ఉంది. ఈమెకు కార్లంటే మహా పిచ్చంట, ఆలియా వద్ద 25 కోట్లకు పైగా విలువ చేసే కార్లు ఉన్నాయి.

ఆలియా భట్ టాలీవుడ్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' లో ఒక హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ వంటి పలు బాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ మూవీ ఏప్రిల్ లో అయినా రిలీజ్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.








మరింత సమాచారం తెలుసుకోండి: