సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ ఎక్కువ కాలం కొనసాగాలంటే అందం అభినయంతో పాటుగా లక్ కూడా కలిసి రావాలి. అప్పుడే స్టార్ హీరోయిన్ గా స్థానాన్ని దక్కించుకుని ముందుకు వెళుతుంది. అలాంటిది ఒక హీరోయిన్ మాత్రం వరుసగా ప్లాప్ లను ఎదుర్కొంటోంది. టాలీవుడ్ లో అందం కన్నా కూడా సక్సెస్ ఉంటేనే ఎక్కువగా గుర్తిస్తారు. ఆమె ఎవరో కాదు ఢిల్లీ నుండి వచ్చిన కేతికా శర్మ. ఈమె తన మొదటి సినిమాను పూరి జగన్నధ్ కొడుకు ఆకాష్ పూరితో "రొమాంటిక్" మూవీలో నటించింది. కానీ ఈ సినిమా మాత్రం తనకు సక్సెస్ ను ఇవ్వడంలో ఫెయిల్ అయింది. అలా తన కెరీర్ ను ప్లాప్ తో స్టార్ట్ చేసింది.

అయినా కానీ తనకున్న అందంతో అవకాశాలను వచ్చేలా చేసుకుంది. ఆ తర్వాత యువ హీరో నాగశౌర్య నటించిన ఆర్చరీ స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య" లో నటించింది. ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నప్పటికీ, ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది ఈ చిత్రం. రెండవ సినిమా కేతికా కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఎందుకు ఖాతాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్నది తనకే తెలియాలి. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ తో జత కట్టింది. గత వారమే రంగ రంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కానీ ఈ సినిమా కూడా తన రాతను మార్చలేకపోయింది. మూడు సినిమాలలో కల్లా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా మిగిలింది.. సో దీనితో కేతిక ఒక ప్లాప్ హీరోయిన్ గా మిగిలిపోయింది. ఇక ఈమె కెరీర్ ముందుకు పోవాలంటే ఏదైనా అద్భుతమే జరగాలి. ఇక ఢిల్లీ కి సర్దుకోవాల్సిందే అంటున్నారు సీనియా వర్గాలు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒకటి రెండు అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ ఆ వచ్చే సినిమాలలో హిట్ ను సాధించకపోతే ఈ అమ్మడు కెరీర్ క్లోజ్ అయినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: