కొందరు లక్షల కొద్ది డబ్బులు సంపాదిస్తున్నా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. మరికొందరు వేల జీతాల తోనే ఇంటిని ముందుకు నడిపిస్తూ సంతోషంగా జీవిస్తుంటారు. దీనికి వాస్తు దోషాలు కూడా ప్రధాన కారణం అయి ఉండొచ్చని చెబుతున్నారు వేద పండితులు. హిందువులు ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంటారు. ముఖ్యంగా శుభ సమయం , వాస్తుల విషయాల పై చాలా శ్రద్ద చిపెడుతుంటారు. ఒక ఇల్లు కొంటున్న , కడుతున్న శుభ సమయాలు, వాస్తులు చూసి ఇళ్ళను కొనడం, నిర్మించడం వంటివి చేస్తుంటారు. కాగా వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం మాత్రమే కాదు వాస్తు పరంగా ఇంటిలో వస్తువులను ఉంచాలి లేదంటే వాస్తు దోష ఫలితంగా ఆ కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్దికంగా చితికిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఇపుడు కొన్ని వాస్తు ప్రకారం చేయాల్సిన వాటి గురించి తెలుసుకుందాం.

ఉత్తర దిశ బాగుంటే.. ఆ కుటుంబ సభ్యుల జీవితం కూడా అద్భుతంగా  ఉంటుంది. ఉత్తర దిక్కున కనుక ఇంట్లో డబ్బులు లేదా బంగారం లేదా విలువైన డాక్యుమెంట్లు  పెట్టుకుంటే.. మన ఆర్ధిక స్థోమత కూడా పెరుగుతుంది అని అంటున్నారు.  అలాగే ఇంటిలో ఉత్తరం దిక్కున బాత్‌ రూంలు, స్టోర్ రూం లు వంటివి కట్టరాదట. .  అలాగే నెలవారీ సరుకులు తెచ్చిన వాటిని కూడా వాయువ్య దిశలో పెట్టుకుంటే చాలా మంచిదట. ఈ వాయువ్య దిశ చక్కగా పెట్టుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.  ఇక కుబేరుడి స్థానంగా పేరొందిన ఈ దిక్కున సరుకులు, డబ్బులు, నగలు వంటివి పెట్టుకోవాలి.

ఏ దిక్కున ఇళ్లు కట్టుకున్నా సరే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా బాగుండాలి అంటే... ఉత్తర మధ్య ద్వారంలో మెయిన్‌ డోర్‌ పెట్టుకోవాలి. ఇక చేస్తే ఆర్ధిక సమస్యలు రావట.  దిక్కు ఇళ్లు అయినా.. వాయువ్య దిశ వైపునకు జరిగితే సమస్యలకు దారితీస్తుంది అని అంటున్నారు. ఇలా ఉండటం వలన వాస్తు దోష కారణంగా  ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలబడదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: