సుజుకి నుండి వచ్చిన స్విఫ్ట్ వెహికల్ ఎంతో గొప్ప సేల్స్ ను కలిగి ఉంటుంది. సుజుకి కార్ల ప్రతిష్ట పెంచేలా చేసిన స్విఫ్ట్ అన్ని వర్గాల వారికి సౌకర్యవంతమైన వెహికల్ గా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటిదాకా దాని సేల్స్ క్రాస్ చేసేలా ఏ వెహికల్ రాలేదు కాని ఈమధ్య స్విఫ్ట్ కు బ్రేక్ వేస్తూ హ్యుండై నుండి వచ్చిన బ్రాండ్ న్యూ ఐ10 కాస్త సేల్స్ లో స్విఫ్ట్ ను క్రాస్ చేస్తుందని అంటున్నారు.


గత రెండునెలల్లో స్విఫ్ట్ కార్లు 25వేల దాకా అమ్ముడవగా హ్యుండై ఐ 10 మాత్రం 28వేల యూనిట్స్ దాకా సేల్ అయ్యాయని రిపోర్ట్. గత 6 నెలల్లో కూడా స్విఫ్ట్ కు సరిసమానంగా ఐ10 సేల్స్ ఉన్నాయట. 6 నెలల్లో స్విఫ్ట్ 78,125 యూనిట్స్ సేల్స్ సాధించగా.. ఐ10 78,053 యూనిట్స్ అమ్ముడవడం జరిగిందట. మొత్తానికి స్విఫ్ట్ జోరుకి హ్యుండై న్యూ ఐ 10 బ్రేక్ వేసిందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: