ఇయర్ ఎండింగ్ లో సేల్స్ పెంచుకునేందుకు ఎట్రాక్టింగ్ ఆఫర్స్ తో పాటు స్టాక్ క్లియరింగ్ కోసం మోటార్ కంపెనీలన్ని ఉత్సాహరమైన ఆఫర్లను ప్రకటిస్తాయి. ఇక ఈ ఇయర్ డిసెంబర్ నెలలో హ్యుండై మొదట ఆఫర్స్ ను ప్రకటించింది. ఇయర్ ఎడింగ్ సేల్ ఆఫర్స్ కు డిసెంబర్ డిలైట్ పేరుతో ఎట్రాక్టింగ్ ఆఫర్స్ గొప్ప తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది హ్యుండై. హ్యుండై ఎంట్రీ లెవల్ కారు ఇయాన్ మీద 65వేల రూపాయల గరిష్ట తగ్గింపు ధర ప్రకటించింది. ఇప్పుడు హ్యుండై ఇయాన్ 2.95 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.


ఇక హ్యుండై ఐ 10 పెట్రోల్ వెహికల్ మీద 80వేలు, డీజిల్ వెహికల్ మీద 90వేల రూపాయలను తగ్గించింది. అంతేకాదు ప్రత్యేక ధరతో హ్యుండై ఎక్సంట్ సెడన్ కార్ 5.29 లక్షలకే ఇస్తున్నారు. ఇక ప్రీమియం హ్యాక్ బ్యాక్ కార్లైన ఐ20, ఐ20 యాక్టివ్ కార్ల మీద 55వేల తగ్గింపు ధర ప్రకటించారు. ఇక ఇవే కాకుండా హ్యుండై ఎలెంత్రా, ఎక్సెంట్ మిగిలిన కార్ల మీద కూడా రగిన ప్రయోజనాలను అందిస్తుంది హ్యుండై మోటార్ కంపెనీ.



మరింత సమాచారం తెలుసుకోండి: