దేశీయ మార్కెట్ లో మారుతి సుజుకి కార్లకు ఉన్న సేల్స్ మరే కంపెనీ కార్లకు ఉండవని తెలుస్తుంది. మధ్యతరగతి కారుగా మారుతిని ప్రజలు సొంతం చేసుకున్నారు. అయితే మారుతి నుండి వచ్చిన బాలెనో.. హ్యుండై నుండి వచ్చిన ఐ20, హోండా బజ్ వంటి కార్లకు పోటీగా నిస్సాన్ ఓ కొత్త కారుని మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతుంది. నిస్సాన్ నుండి రాబోతున్న ఈ పవర్ నోట్ ను తమిళనాడులో టెస్ట్ డ్రైవ్ చేశారు.  


ఈ పవర్ నోట్ వెహికల్ 3 సిలిండర్ లతో పాటుగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ బ్యాటరీ పవర్ ను చార్జ్ చేస్తుంది. సెపరేట్ గా బ్యాటరీ చార్జింగ్ కోసం వెళ్లకుండా కారులోనే పెట్రోల్ ఇంజిన్ బ్యాటరీలను చార్జ్ చేస్తుంది. బ్యాటరీ చార్జింగ్ అయ్యేందుకు అవకాశం ఉన్న వెంటనే పెట్రోల్ ఇంజిన్ ఆన్ అయ్యి ఆటోమెటిక్ గా బ్యాటరీలు చార్జ్ చేయడం మొదలు పెడుతుందట. మొత్తానికి మరుతి బాలెనొకి పోటీగా వస్తున్న నిస్సాన్ నోట్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటుందో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: