హ్యుండై మోటార్స్ నుండి ఐ30 వెహికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ కారు రెడీ అవగా చెన్నైలో ఈ వెహికల్ స్పాట్ టెస్టింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇతర దేశాల్లో ఐ30 కార్లు ఇప్పటికే రిలీజ్ చేసిన హ్యుండై ఇండియాలో త్వరలో రిలీజ్ చేయబోతుంది. హ్యుండై ఐ30 2019 ప్రారంభంలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.


ఇండియాలో హ్యాచ్ బ్యాక్ కార్ల విభాగంలో హ్యుండై ఎలైట్ ఐ20తో పాటుగా మారుతి బాలెనో హోండా జాజ్ కార్లు ఉన్నాయ్. వాటికంటే టెక్నికల్ గా ఇంకాస్త ఎక్కువ ఫీచర్స్ తో ఈ వెహికల్ వస్తుంది. మార్కెట్ లో ఉన్న హ్యుండై ఐ20, క్రెటా వెహికల్స్ ఐ30 రీప్లేస్ చేయనుంది. ఇక ఈ వెహికల్ బరువు 1316 కిలోలు ఉంటుందట.


16 అంగుళాల ఎల్లాయి వీల్స్ తో ఈ వెహికల్ వస్తుంది. ఇప్పటివరకు అమెరికా ఇంకా యూరోపియన్ దేశాల్లో అందుబాటులో ఉన్న హ్యుండై ఐ30 కార్లను ఇండియాకు తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి రాబోతున్న ఈ వెహికల్ హ్యుండై సేల్స్ రేటుని ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: