2019 హ్యుండై కార్ల సేల్స్ ఆశాజనంగా లేవని తెలుస్తుంది. అందుకే హ్యుండై మోటార్స్ తమ వెహికల్స్ మీద ధరలను తగ్గించారు. హ్యుండై డీలర్స్ ఎట్రాక్టివ్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఇండియాలో ఎస్.యు.వి కార్ల సేల్స్ తగ్గుముఖం పట్టాయి. అందుకే హ్యుండై తమ వాహనాల రేట్లను స్వల్పంగా తగ్గించడం జరిగింది. 


హ్యుండై గ్రాండ్ ఐ10, ఎక్సెంట్, వెర్నా, శాంత్రో, ఐ20, ఐ20 యాక్టివ్ కార్ల మీద వాహనాల రేట్లను బట్టి ప్రైజ్ తగ్గించారు. హ్యుండై ఐ20, ఐ20 యాక్టివ్ వాహనాలకు 35వేల దాకా ధరలు తగ్గించారని తెలుస్తుంది. శాంత్రో ధర 40,000 దాకా తగ్గించారు. హ్యుండై వెర్నా 60వేల వరకు ప్రైజ్ సేవ్ చేసుకోవచ్చు.


ఇక హ్యుండై ఎక్సెంట్ కారు అత్యధికంగా 1.1 లక్ష దాకా తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. హ్యుండై ఐ 10 మీద కూడా 1 లక్ష దాకా ప్రైజ్ సేవ్ అయ్యిందట. ఇండియాలో అత్యధిక కస్టమర్స్ ఉన్న హ్యుండై వాహనాల సేల్స్ పెంచుకునేందుకు ఇలా ధరలను అనూహ్యంగా తగ్గించారు. మరి ఈ తగ్గిన ధరల వల్ల హ్యుండై వెహికల్స్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: