విదేశాల్లో మోరీస్ గ్యారేజెస్ వాహనాలకు మంచి గిరాకి ఉంది. ఇప్పుడు ఎం.జి తన మార్కెట్ పెంచుకునే క్రమంలో తమ వాహనాలను ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో మోరిస్ గ్యారేజెస్ మొదటి వెహికల్ రిలీజ్ అయ్యింది. ఎం.జి మోటార్స్ నుండి మొదటిగా హెక్టార్ రిలీజైంది. ఎస్.యు.వి మోడల్ గా వచ్చిన ఎం.జి హెక్టార్ వాహందారులను ఆకర్షిస్తుంది.


ఈ వెహికల్ ధర 12.18 నుండి 16.88 లక్షల వరకు ఉంది. ఎం.జి హెక్టార్ వెహికల్ హ్యుండై క్రెటా, టాటా హ్యారియర్ లాంటి వాహనాలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇండియన్ మార్కెట్ పై తన ప్రతాపం చూపించాలని చూస్తున్న మోరిస్ గ్యారేజెస్ వెహికల్స్ కు ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. అధునాతనమైన సౌకర్యాలతో వీ వెహికల్స్ వస్తున్నాయి.


వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన మోరిస్ గ్యారేజెస్ వెహికల్స్ ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కచ్చితంగా ఈ వెహికల్స్ వల్ల ఇతర మోటార్ కంపెనీ వెహికల్స్ కు సేల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎస్.యు.వి మోడల్ లో ఎం.జి హెక్టార్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: