భారత్ లో హ్యుండాయ్ విడుదల చేసే కార్లలో అత్యుత్తమ విక్రయాలు పొందిన వాహనాల్లో శాంత్రో ఒకటి. అయితే ఇటీవలే ఈ కారును BS - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి ఇండియా విపణిలోకి విడుదల చేసింది. ఇక పోతే ఈ కారు ఖరీదు ఎక్స్ షోరూంలో వచ్చే సరికి రూ.5.85 లక్షలు. ఇకపోతే, BS - 6 శాంత్రో సీఎన్జీ మోడల్ ను భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. 

IHG


ఇక ఈ కార్ ప్రస్తుతం ఖరీదు వచ్చేసి రూ.6.20 లక్షలు అండగా అంతేకాకుండా ఈ కారు 2 వేరియంట్లలో లభిస్తుంది. మ్యాగ్నా, స్పోర్ట్జ్ అనే రెండు వేరియంట్లలో ఈ వాహనాన్ని పొందవచ్చు. శాంత్రో మోడల్ ను మొదటిసారి భారత్ లో 2018 సంవత్సరంలో లాంచ్ చేశారు. అప్పుడు ఈ వాహనం ప్రారంభ ధర కేవలం రూ.5.23 లక్షలు. అదే స్పోర్ట్జ్ అనే వేరియంట్ ధర కూడా కేవలం రూ.5.64 లక్షలు. అయితే ప్రస్తుతం BS - 5 మ్యాగ్నా వేరియంట్ ధర రూ.62,000 కుపెరగనుంది. అదే స్పోర్ట్జ్ వేరియంటైతే రూ.56,000 వరకు ధర పెరగనుంది.

 

ఇక ఇంజిన్ విషయానికి వస్తే .. BS - 6 ఫార్మాట్లో నిర్మితమైన ఈ హ్యాచ్ బ్యాక్ 1.1- Lr నాలుగు సిలీండర్ల మోటార్ ను కలిగి ఉండి 69 BHP బ్రేక్ హార్స్ పవర్, 99 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5- స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఈ కార్ నడవగా, ఈ రెండు వేరియంట్లు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఆప్షన్ ను కలిగి ఉండి నలుపు రంగు క్యాబిన్ ఇందులో కాస్త వైరెటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: