ఆగస్టు 15, 2020 నా భారతదేశం 73 వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే నేపద్యంలో భారతదేశంలోని వివిధ ఆటోమొబైల్ రంగ సంస్థలు భారత విపణిలోకి కొత్త ఉత్పత్తులను ప్రవేశ పెట్టబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా. భారతదేశ స్వాతంత్ర దినోత్సవం తో పాటు, అనేక పండుగల నేపథ్యం లో ఈ కొత్త వాహనాలను ఆగస్టు నెలలో విడుదల చేస్తున్నాయి ఆటోమొబైల్ రంగ సంస్థలు. కొనడానికి మంచి రోజులు కాబట్టి వాహనదారులు ముందుకు వస్తారు అన్న ఆలోచనలో అనేక మోడల్స్ ను ఈ నెల విడుదల చేస్తున్నారు. ఇక కొత్త ఉత్పత్తులు వాహనాలు దారులను ఎక్కువగా ఆకర్షించడానికి వాటిపై అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. డిస్కౌంట్ ఆఫర్లు కాకుండా పాత వాహనాలపై ఎక్స్ చేంజ్ ఆఫర్ ని ప్రకటించడమే కాకుండా, కొత్త కార్స్ పై కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ను కూడా అందజేస్తున్నాయి.

ఇకపోతే ఐదు నెలలుగా లాక్ డౌన్ నేపథ్యంలో భారతదేశం లోని ఆటోమొబైల్ రంగ సంస్థ పూర్తిగా దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. తిరిగి వాటి ఉత్పత్తిని పెంచడం వాహనదారులను ఆకర్షించడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి ఆటోమొబైల్ రంగ సంస్థలు. రానున్న కొద్ది రోజుల్లోనే తిరిగి తమ అమ్మకాలను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. ఇక ఈ నెలలో భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే కార్ల విషయాల గురించి ఒక లుక్ వేద్దాం.



ఇక ఆగస్టు నెల భారత మార్కెట్ లోకి విదులయ్యే కార్స్ చూస్తే.. కియా సోనెట్ కాంపాక్ట్ (ఎస్‌యూవీ), టాటా HBX మైక్రో (ఎస్‌యూవీ), న్యూ హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ప్రీమియం హ్యాచ్ ‌బ్యాక్, రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ (ఎస్‌యూవీ), బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే కార్స్ భారత మార్కెట్ లోకి రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: