భారత మార్కెట్లోకి త్వరలోనే కియా మోటార్స్ కంపెనీ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది.టీమ్‌బిహెచ్‌పి నుండి వచ్చిన తాజా చిత్రాల ప్రకారం, ఓ డీలర్ యార్డ్‌లో గుర్తించిన సోనెట్ ఎస్‌యూవీలో జిటి-లైన్ వేరియంట్ వివరాలను ఇలా ఉన్నాయి. ఇది ఈ ఎస్‌యూవీ లైనప్‌లో లభ్యం కానున్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 1.0-లీటర్ టి-జిడిఐ టర్బో ఇంజన్‌తో పాటుగా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుందని నిపుణులు తెలిపారు.

అంతేకాక కియా సోనెట్ కోసం దేశంలో ప్రీ-లాంచ్ బుకింగ్‌లను ప్రారంభించిన మొదటి రోజే రికార్డు స్థాయిలో 6,523 యూనిట్లను నమోదు చేసిందని తెలిపారు. ఇక సోనెట్ మార్కెట్లోకి ప్రవేశించక ముందే కియా బ్రాండ్ కోసం ఓ కొత్త మైలురాయిని సాధించి పెట్టిందని తెలిపారు. కియా సోనెట్ దేశంలో కియా మోటార్స్‌కు మూడవ ఉత్పత్తి అవుతుందన్నారు. దీనిని భారతదేశంలోనే తయారు చేసి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నారు. తాజా నివేదిక ప్రకారం, కియా మోటార్స్ తమ సోనెట్‌ను రెండు పెట్రోల్, రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందించనుందని తెలిపారు.

అంతేకాకుండా సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుందని తెలిపారు. కియా సోనెట్‌లో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రపంచంలోనే మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను కంపెనీ అందిస్తోందని తెలిపారు.

ఇక కియా సోనెట్ మార్కెట్లో విడుదల కావటానికి ముందే డీలర్‌షిప్‌ల వద్దకు రావడాన్ని చూస్తుందన్నారు. కియా మోటార్స్ ఈ మోడల్‌ను వీలైనంత త్వరగా కస్టమర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అనిపిస్తోందని తెలిపారు. ఇక మార్కెట్ ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యువి 300 మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుందని నిపుణులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: