హ్యుందాయ్ కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ కార్లు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. స్టైల్, కలర్ మొదలగు అంశాలు కంపెనీకి మంచి గుర్తింపు ను తీసుకు వచ్చాయి.. కంపెనీకి చెందిన క్రెటాకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మోడల్‌కు దేశంలో డిమాండ్ భారీగా పెరుగుతోందని హ్యుందాయ్ తెలిపింది. క్రెటా ఉత్పత్తి సామర్థ్యానికి సుమారు మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ ఉందని సంస్థ తాజాగా ప్రకటించింది. హ్యుందాయ్ 2015లో క్రెటాను మార్కెట్లోకి విడుదల చేసింది.

 
గత ఏడాది సెకండ్ జెనరేషన్ క్రెటాను భారత్‌లో అందుబాటు లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి దీనికి డిమాండ్ ఊహించని విధంగా పెరుగుతోంది.. కాగా, భారత్ లో అమ్ముడు పోయిన అత్యధిక కెట్రా సరికొత్త రికార్డు ను సృష్టించింది. హ్యుందాయ్ క్రెటా లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. మల్టిపుల్ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల తో క్రెటాను రూపొందించారు. ఈ SUV లో పనోరమిక్ సన్ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ ఎడ్జెస్టబుల్ డ్రైవర్ సీటు, ఎయిర్ ప్యూరిఫైయర్, కీలెస్ ఎంట్రీ, క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్.. వంటి ప్రీమియం ఫీచర్లు కస్టమర్లను తెగ ఆకట్టుకుంటుంది.


గత మూడేళ్లల లో భారత్‌ లో హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు 5,50,002 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019లో మొత్తం సేల్స్ 5,10,260 యూనిట్లకు పడిపోయాయి. 2020లో ఈ సంఖ్య 4,23,642 యూనిట్లకు పరిమితమైంది. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్నందువల్ల మొత్తం అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో హ్యుందాయ్ మొత్తం SUV అమ్మకాలు 10 లక్షలు దాటినట్లు సంస్థ ఇటీవల ప్రకటించింది.. ఈ రకమైన కార్ల ధరల కూడా అందుబాటు లో ఉన్నాయి. అందుకే జనాలు ఎక్కుబాగా వీటిని తీసుకోవడం చేస్తున్నారు. త్వరలో అల్కాజర్ ను కూడా మార్కెట్ లోకి విడుదల కానున్నాయని కంపెనీ వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: