భారత దేశ కార్ల కంపెనీ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎస్ యువి కార్లకి మహీంద్రా పెట్టింది పేరు అని చెప్పాలి. ఇక హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ మొదలైన మోడళ్లకు పోటీగా, ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన బ్రాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రవేశపెట్టిన తమ లేటెస్ట్ ఎక్స్‌యూవీ300 బుకింగ్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.2021 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ బుకింగ్‌లు 90 శాతం పెరిగాయని కంపెనీ ప్రకటించింది.


దీంతో మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధర కూడా పెరిగింది.వేరియంట్‌ను బట్టి రూ.1,000 నుండి రూ.39,000 వరకూ ధరలను పెంచింది. పెరిగిన ధరలను ఎక్స్-షోరూమ్ నుండి ఆన్-రోడ్‌కు పోల్చి చూస్తే అవి సుమారు రూ.90,000 వరకు ప్రభావితం చేస్తాయి. ధరల పెరుగుదల తర్వాత ఈ ఎస్‌యూవీ ఇప్పుడు రూ.7.96 లక్షల నుండి రూ.12.94 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో లభిస్తుంది.ఇందులో ఏబిఎస్ విత్ ఇబిడి, 2 ఎయిర్‌బ్యాగులు, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ మొదలైనవి ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ఈ మోడల్ కోసం ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ కూడా సుమారు 12 వారాలకు పైగా ఉంటోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్‌ని కంపెనీ భారత మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశపెట్టింది.


మహీంద్రా ఎక్స్‌యూవీ300 పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది ఎక్కువగా 109 బిహెచ్‌పి శక్తిని ఇంకా 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ ఎక్స్‌యూవీ300లో 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది 117 బిహెచ్‌పి శక్తిని ఇంకా 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో కంపెనీ సైలెంట్‌గా కొన్ని ఫీచర్లను తొలగించింది. ఇందులో ఇప్పుడు రెండవ వరుసలోని మధ్యలో కూర్చునే ప్యాసింజర్ కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌ను తొలగించి, కేవలం ల్యాప్‌బెల్ట్ మాత్రమే ఆఫర్ చేసింది. అలాగే, ఇప్పటి వరకూ ఈ కారులో ఆఫర్ చేసిన హీటెడ్ సైడ్ మిర్రర్స్ ఫీచర్‌ను కూడా కంపెనీ తొలగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: