ఇండియన్ మార్కెట్లో హ్యుండయ్ కంపెనీకి మంచి క్రేజ్ ఉందని సంగతి తెలిసిందే. ఇక ఇండియా మార్కెట్ లో తన కొత్త కార్ ఆల్కాజార్‌ను విడుదల చేసి ఇప్పటికి సరిగ్గా నెల రోజులు పూర్తయింది. అయితే ఈ నెల రోజుల కాలంలోనే దాదాపు 11,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు కంపెనీ ఆఫీషియల్ గా తెలిపడం జరిగింది. ఇక ఇది మాత్రమే కాకూండా విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ కొత్త ఎస్‌యూవీ కార్ కి చాలా మంచి స్పందన వస్తోందని కూడా హ్యుండయ్ కంపెనీ తెలిపడం జరిగింది.హ్యుండయ్ అల్కాజార్ ఎస్‌యూవీ క్రెటా కార్ యొక్క 7 సీట్స్ వేరియంట్ పైన ఆధారపడి ఉంటుంది.ఇక ఈ కొత్త ఆల్కాజార్ ఎస్‌యూవీ కార్ యొక్క ప్రారంభ ధర వచ్చేసి రూ. 16.30 లక్షలు(ఎక్స్‌షోరూమ్) కాగా, ఆల్కాజార్ టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది.ఇక ఈ కొత్త ఆల్కాజర్ కార్ లేటెస్ట్ ఫీచర్స్ ని కలిగి ఉంటుంది.ఇక కంపెనీ అందించిన ఆఫీషియల్ సమాచారం ప్రకారం, హ్యుండయ్ అల్కాజార్ యొక్క టాప్ రేంజ్ సిగ్నేచర్‌ను వినియోగదారులు చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

ఇక ఈ వెర్షన్ లో డీజిల్ మోడళ్ల కూడా దాదాపు 63% బుకింగ్స్ స్వీకరించినట్లు హ్యుండయ్ కంపెనీ తెలిపడం జరిగింది.హ్యుండయ్ అల్కాజార్ కార్ ఎంతో అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ ఇంకా స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ అలాగే లాంగ్ రియర్ ఓవర్‌హాంగ్ ఇంకా వెనుక భాగంలో ప్రముఖ క్వార్టర్ గ్లాస్ అలాగే 18 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.ఇక ఈ కొత్త ఆల్కాజార్ కార్ మొత్తం 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుందట. అవి టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ ఇంకా ఫాంటమ్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.ఇక ఈ కొత్త హ్యుండయ్ అల్కాజార్ యొక్క కొలతల విషయానికి వస్తే.. ఈ కార్ పొడవును 4,330 మి.లీ, 1,790 మి.లీ వద్ద కంపెనీ ఉంచగా ఇక వీల్ బేస్ మాత్రం 2,760 మిమీ పొడవు వుందట. ఇది హ్యుండయ్ క్రెటా కంటే కూడా 150 మిమీ పొడవుగా ఉంటుందట. ఇక అలాగే ఇందులో 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ కూడా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: