ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ అయినా టాటా మోటార్స్ తమ పంచ్ మైక్రో ఎస్‌యూవీ కార్ ని ఆవిష్కరించిన కొద్ది రోజుల్లోనే ఇండియాలో రెండవ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీగా దూసుకుపోతున్న హ్యుందాయ్ కూడా ఈ విభాగంలో తమ కాస్పర్ (Casper) మైక్రో ఎస్‌యూవీ కార్ ని ఆవిష్కరించడం జరిగింది. ఇక ఈ కంపెనీ ఇప్పుడు ఈ మినీ ఎస్‌యూవీ కార్ కి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడి చేయడం జరిగింది.ఇక తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ కంపెనీ త్వరలోనే తమ క్యాస్పెర్ మైక్రో ఎస్‌యూవీ కార్ ని ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయబోతోంది. ప్రారంభానికి ముందే ఈ కొరియన్ కార్ కంపెనీ తమ మినీ ఎస్‌యూవీ ఎక్స్టీరియర్ ఇంకా ఇంటీరియర్‌ వివరాలను వెల్లడి చేసే చిత్రాల ద్వారా కొత్త 2022 క్యాస్పెర్ గురించి మరిన్ని వివరాలను పంచుకుంది.ఇక ఈ నెల ప్రారంభంలో, హ్యుందాయ్ క్యాస్పెర్ మైక్రో ఎస్‌యూవీ కార్ మొదటి అధికారిక చిత్రాలను కంపెనీ విడుదల చేయడం జరిగింది.ఇక ఇందులో కారు బయట డిజైన్‌ను ప్రదర్శించడం జరిగింది.

 ఇక ఈ కారు ఫ్రంట్ డిజైన్ ను కనుక గమనిస్తే, పెద్ద రేడియేటర్ గ్రిల్ ఇంకా ఫ్రంట్ బంపర్ లో అమర్చిన గుండ్రటి హెడ్‌లైట్స్ అలాగే ఫ్రంట్ బంపర్‌లో బ్లాక్ అండ్ గ్రే గార్నిష్ ఇంకా హుడ్ క్రింద అమర్చిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ లాంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.ఇక దీని సైడ్ డిజైన్ కూడా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. అలాగే ఇందులో సరికొత్త అల్లాయ్ వీల్స్ అలాగే ఉబ్బినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్ ఇంకా అలాగే బాడీ చుట్టూ కూడా సన్నటి బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఇంకా బాడీ కలర్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ ఇక వెనుక విడ్‌షీల్డ్ దగ్గర అమర్చిన రియర్ డోర్ హ్యాండిల్ అలాగే ఫంక్షనల్ రూఫ్ రెయిల్ ఇంకా బ్రాక్డ్ అవుట్ ఏ పిల్లర్ వంటి డీటేలింగ్స్ కూడా ఈ కార్ లో ఉన్నాయి.అలాగే కార్ వెనుక డిజైన్‌లో బంపర్ లో అమర్చిన రెండు గుండ్రటి టెయిల్ ల్యాంప్స్ ఇంకా అలాగే వాటి మధ్యలో నెంబర్ ప్లేట్, బంపర్ కింద భాగంలో బ్లాక్ అండ్ గ్రే కలర్ స్కిడ్ ప్లేట్ ఇంకా షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ స్పాయిలర్ అలాగే రియర్ వాషర్ అండ్ వైపర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఈ కార్ లో వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: