దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో ఇటీవల కాలంలో విడుదల చేసిన టాటా పంచ్ (Tata Punch) అనే మైక్రో SUV ని విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ SUV దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి మంచి సేల్స్ తో ముందుకు దూసుకెళ్తోంది.అయితే కంపెనీ ఇప్పుడు 2021 డిసెంబర్ నెల అమ్మకాల నివేదికలను రిలీజ్ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021 డిసెంబర్ నెలలో టాటా పంచ్ మొత్తం 8,008 యూనిట్లు కార్లు విక్రయించబడ్డాయి. ఇది కంపెనీ సాధించిన అత్యధిక విక్రయాలు చెప్పవచ్చు. కంపెనీ 2021 నవంబర్ నెలలో 6,110 యూనిట్లు విక్రయించబడ్డాయట.కావున నవంబర్ కంటే కూడా డిసెంబర్ నెల అమ్మకాలు వృద్ధి చెందినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

అమ్మకాలు 2021 నవంబర్ నెల కంటే కూడా 2021 డిసెంబర్ నెలలో 31.06 శాతం వృద్ధిని నమోదు చేయగలిగిందని  దీన్ని బట్టి చూస్తే కంపెనీ 2022 జనవరిలో కూడా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశించ వచ్చు.. దేశీయ మార్కెట్లో ఈ చిన్న SUV ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉందని తెలుస్తుంది.

 Tata Punch నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుండట.. అవి ప్యూర్ మరియు అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలుగు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయట . దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది.. అవి ఓర్క్స్ వైట్ మరియు అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్ అలాగే కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

 Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడిందట.ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుందని తెలుస్తుంది.

 కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది.ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ కూడా మనం చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా కూడా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు మరియు డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: