ఫేమస్ ఇండియన్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company), భారత మార్కెట్లో ఈ ఏడాది (2022లో) అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా తమ ప్రోడకట్ లైనప్‌ను విస్తరించేందుకు రెడీగా ఉంది. కొత్త ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టడానికి ఇంకా ద్విచక్ర వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కంపెనీ 700 కోట్ల రూపాయల మూలధనాన్ని వెచ్చించేందుకు టీవీఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇందులో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కూడా రిలీజ్ చేయనున్నారు.ఇక మన దేశంలో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన జనవరి 2020లో ఐక్యూబ్ (iQube) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఇండియన్ ఈవీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కంపెనీ ఇప్పటి వరకూ కూడా దేశవ్యాప్తంగా  మొత్తం 12,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మడం జరిగింది. అలాగే ఓ మీడియా కథనం ప్రకారం, టీవీఎస్ 5Kw ఇంకా 25 Kw విభాగాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర ఇంకా మూడు చక్రాల వాహనాలను రెడీ చేస్తోంది.



ఇవన్నీ రాబోయే 8 త్రైమాసికాలలో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిలో మొదటి ఈవీ FY 23 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి రావచ్చని అంచనా.ఇక ప్రస్తుతం, టీవీఎస్ కంపెనీ నుండి లభిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్.మన దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో,టీవీఎస్ కంపెనీ తమ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని ప్రతి ఏటా 10,000 యూనిట్లకు పెంచాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇక టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో టూ-వీలర్ స్పేస్‌లో 17 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక టీవీఎస్ కంపెనీ గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10.9 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TVS