ఇక తెలుస్తున్న నివేదికల ప్రకారం.. హ్యుందాయ్ శాంత్రో పెట్రోల్ వేరియంట్ ప్రొడక్షన్ ఆపేయడం జరిగింది. వాటి ప్రొడక్షన్ ఆపేసినప్పటికీ, cng వేరియంట్ అమ్మకాలు మాత్రం కొనసాగనున్నట్లు సమాచారం. అయితే డీలర్‌షిప్‌ స్టాక్‌లు ముగిసే దాకా పెట్రోల్ వెర్షన్లు కూడా అమ్మే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ 2022 ఆర్థిక సంవత్సరంలో శాంత్రో కార్లను దాదాపు 2,000 యూనిట్లు అమ్మింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఒకానొక సమయంలో హ్యుందాయ్ నుంచి చాలా ఎక్కువగా అమ్ముడైన కార్లలో ఈ హ్యాచ్‌బ్యాక్ ఒకటి కావడం గమనార్హం. హ్యుందాయ్ కంపెనీ మొత్తం అమ్మకాలలో దాదాపు 76 శాతం వాటా శాంత్రో కార్లదే ఉండేది.2018 వ సంవత్సరంలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చిన శాంత్రో కార్ ధర అప్పట్లో 3.9 లక్షల నుండి రూ. 5.5 లక్షల మధ్య ఉండేది. అయితే ఇప్పుడు హ్యాచ్‌బ్యాక కార్ల ధరలు చాలా గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో హ్యుందాయ్ శాంత్రో కారు ధర కూడా పెరిగింది. ప్రస్తుతం శాంత్రో స్టార్టింగ్ ధర(ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం) రూ.4.9 లక్షల నుంచి మొదలై రూ.6.42 లక్షల దాకా ఉంది.



2018 వ సంవత్సరం నుంచి కార్ల ధరల పెరుగుదలకు సేఫ్టీ రూల్స్ ఇంకా BS6 ఉద్గార నిబంధనలు ప్రధాన కారణమని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. అలాగే పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు కూడా వాహన తయారీ సంస్థలకు గుదిబండగా మారాయి.ఈ సంవత్సరం అక్టోబరు నుంచి కొత్త భద్రతా నిబంధనలు అమల్లోకి తీసుకురాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం ప్రయాణికుల భద్రత కోసం ఇకపై అన్ని కొత్త కార్లలో ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఖచ్చితంగా అమర్చాలి. వీటిని ఏర్పాటుకు భారీ ఖర్చు కూడా అవుతుంది. దీంతో ఆటోమెటిక్ గా కార్ల ధరలు కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ బ్యాక్ అమ్మకాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో 'శాంత్రో'ను అప్‌డేట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న నిర్ణయానికి వచ్చింది హ్యుందాయ్ కంపెనీ.దీంతో వీటి ఉత్పత్తిని కూడా నిలిపివేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: