హైదరాబాద్ మహా నగరంలో వాహనాల బిజీ తెలిసిందే. ఉద్యోగాలు, వృత్తి రీత్యా నిత్యం లక్షలాది జనం తమ వాహనాలతో పరుగులు తీస్తుంటారు. తమ తమ గమ్యాలను సమయానికి చేరుకోవడానికి చాలా మంది పరిమిత వేగానికి మించి వేగంగా వెళుతూ కొన్ని సార్లు ప్రమాదాల భారిన పడుతుంటారు. ఇలాంటి వారిలో కొందరు తమ ప్రాణాలనే కోల్పోతారు. వేగం కన్నా ప్రాణం మిన్నా, అతి వేగం హానికరం ఇలా వందల బోర్డులు దారి పొడవునా ఉన్న చాలా మంది వీటిని అస్సలు పట్టించుకోరు. అందుకే పోలీసు అధికారులు చలానాలు అని, కఠిన చర్యలు అని చర్యలు తీసుకోక తప్పడం లేదు.

అందుకే కొత్త కొత్త ఆలోచనలతో ప్రమాదాలను తగ్గించేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు సదరు అధికారులు. ఈ క్రమంలో మరో కొత్త ఆలోచనతో ప్రమాదాలను అరికట్టడానికి రెడీ అయ్యారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు గాను ఇటీవల ప్రభుత్వం స్పీడ్ లిమిట్ విషయమై కొత్త నియమాల్ని విధించిన సంగతి అందరికి తెలిసిందే. కాగా ఎక్కడ ఎంత వేగంతో ప్రయాణించాలి అని వాహనదారులకు దిశా నిర్దేశం చేసింది. ప్రధాన రహదారులపై నాలుగు చక్రాల వాహనాలు 60 కి.మీ. వేగంతో అదే విధంగా ఆటోలు & బైక్‌లు 50 కి. మీ. వేగంతోనే ప్రయాణించాలని సూచించింది.

కాలనీ రోడ్లలో గరిష్టంగా 30 కి. మీ. వేగంతోనే వెళ్ళాలని.. అంతకు మించి వేగంగా బండ్లను రోడ్డుపై నడిపితే  ఫైన్స్ మరియు చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించి ఈ స్పీడ్ లిమిట్‌పై అధికార ప్రకటన విడుదల చేస్తూ ఈ అంశాలను వెల్లడించింది సర్కారు.  అయితే.. హైదరాబాద్‌లోని అన్ని ఫ్లై ఓవర్లపై మాత్రం పెద్దగా ఆటంకాలు ఉండవు... కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ పై స్పీడ్ లిమిట్‌ను 80 కి.మీ. పెంచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. దీంతో వాహనదారులు ఖుషి అవుతున్నారు. అయితే జనం రద్దీ ఎక్కువగా ఉండే ....ఆస్పత్రులు, స్కూల్, పార్క్ లు వంటి ప్రాంతాలలో మాత్రం 40 కి.మీ. కంటే ఎక్కువ వేగంగా వెళ్ళకూడదని ప్రకటించారు. కావున హైదరాబాద్ లోని వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: