ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టాటా కంపెనీ తన కార్లపై డిస్కౌంట్ ని ఇస్తుంది. ఇక ఏ కార్లపై ఎంత మేర డిస్కౌంట్స్‌ ఆఫర్ చేస్తోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ఎంట్రీ లెవల్ కారు టియాగో జూన్ నెలలో రూ.10,000 డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ తగ్గింపు టియాగో XZ ట్రిమ్ ఇంకా అంతకంటే హయ్యర్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, కొనుగోలుదారులు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇక టాటా టిగోర్ ఎక్స్‌జెడ్ ట్రిమ్‌ అలాగే అంతకన్నా ఎక్కువ వేరియంట్లపై రూ. 10,000 డిస్కౌంట్ ని పొందొచ్చు.అయితే అన్ని ట్రిమ్‌లపై కూడా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. అలానే కొనుగోలుపై మొత్తం రూ.3,000 కార్పొరేట్ బెనిఫిట్స్ ని దక్కించుకోవచ్చు.టాటా హారియర్ ఇంకా టాటా సఫారిపై డిస్కౌంట్ ఆఫర్లు మిడ్-సైజ్ ఎస్‌యూవీ టాటా హారియర్ కొనుగోలు చేసేవారు రూ.45,000 వరకు బెనిఫిట్స్ ని పొందొచ్చు. అయితే ఈ ఎస్‌యూవీపై డిస్కౌంట్ ఆఫర్స్ పెద్దగా ఏమీ లేవు కాకపోతే మీరు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌గా రూ.40 వేలు ఇంకా అలాగే కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో రూ.5 వేలు పొందడం ద్వారా కారు ధర రూ.45,000 తగ్గించుకోవచ్చు. టాటా సఫారీ త్రీ-రౌ ఎస్‌యూవీ కార్ తో రూ. 40,000 వరకు విలువైన ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు.


టాటా మోటార్స్ తయారు చేసిన అన్ని కార్లలో టాటా నెక్సాన్ చాలా అత్యధికంగా అమ్ముడవుతోంది.అయితే ఈ నెలలో టాటా నెక్సాన్ పెట్రోల్ ట్రిమ్‌లపై రూ. 3,000 ఇంకా డీజిల్ ట్రిమ్‌లపై రూ. 5,000 కార్పొరేట్ బెనిఫిట్స్ కంపెనీ ప్రకటించింది. అయితే టాటా నెక్సాన్‌పై క్యాష్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు అనేవి లేవు అని గుర్తుంచుకోవాలి.టాటా మోటార్స్ ఇటీవల మే నెలకు సంబంధించి విక్రయాల గణాంకాలను కూడా ప్రకటించింది. ఇక ఆ గణాంకాల ప్రకారం, ప్యాసింజర్ వెహికల్ (PV) విభాగంలో టాటా మోటార్స్ మే 2022 నెలలో మొత్తం 185 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక టాటా 2022 మే నెలలో మొత్తం 43,341 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్‌ను విక్రయించింది. అలాగే మే 2021లో బ్రాండ్ 15,181 యూనిట్లు మాత్రమే విక్రయించింది.టాటా ప్యాసింజర్ వాహనాలు ఇంకా వాణిజ్య వాహనాల తో సహా మొత్తం దేశీయ విక్రయాలు 74,755 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే మొత్తం 204 శాతం వృద్ధి నమోదైంది. సాధారణ ఫ్యూయల్‌తో నడిచే పీవీ సెగ్మెంట్ ఇంకా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ రెండింటిలోనూ కంపెనీ వృద్ధిని నమోదు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: