మారుతి సుజుకి కంపెనీ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటని అందరికీ తెలిసిందే. ఇక ఈ కంపనీ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూ.. ఎప్పటికప్పుడు కూడా తన ఫోర్డ్ ఫోలియోలోని వాహనాలను బాగా అప్డేట్ చేస్తూ ఉంది. ఇక ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు కొత్త 'మారుతి సుజుకి వితారా బ్రెజ్జా'ను కూడా విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇక ఇప్పటికే కంపెనీ లాంచ్ డేట్ కూడా వెల్లడించింది. అయితే ఇప్పుడు బుకింగ్స్ స్వీకరించడం కూడా కంపెనీ ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ మనం తెలుసుకుందాం.ఇక భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు ఇక రూ. 11,000 చెల్లించి కంపెనీ అధీకృత డీలర్‌షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు.ఇంకా డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.ఇక 2022 మారుతి సుజుకి బ్రెజ్జా కొన్ని వివరాలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. కావున దీనికి సంబంధించిన కొంత సమాచారం కూడా మీకు అందుబాటులో ఉంది.అలాగే ఈ కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మంచి డిజైన్ కలిగి చూడటానికి చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది.


2022 మారుతి సుజుకి బ్రెజ్జాలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఇంకా అలాగే టెయిల్ సెక్షన్ ఇవ్వబడ్డాయి. ఇంకా అలాగే మారుతి బ్రెజ్జా  ప్రస్తుత మోడల్‌లో ముందు భాగంలో క్రోమ్ గ్రిల్ ఉంది. హెడ్‌లైట్ ఇప్పుడు స్లిమ్ డిజైన్‌తో ఫ్రెష్ లుక్ కూడా ఇవ్వబడింది.అలాగే ఇది డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్సన్ కూడా పొందుతుందని ఇటీవల వెల్లడైన చిత్రాల ప్రకారం తెలిసింది.ఇంకా అలాగే 2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందే అవకాశం కూడా ఉంది.ఇక అంతే కాకుండా ఇందులో ట్విన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అందించబడ్డాయి. ముందు భాగంలో సుజుకి పెద్ద లోగో ఫ్రంట్ గ్రిల్‌లో ఇవ్వబడింది. అలాగే కార్  టెయిల్ సెక్షన్ యారో డిజైన్‌లో ఫాగ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందే అవకాశం ఉంది. వీటితో పాటు కంపెనీ ఇందులో కొత్త 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా ఇవ్వనుంది. ఇక ఇవి డ్యూయల్ టోన్ కలర్‌లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: