ఇక దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల మాన్యుఫాక్చరింగ్ సంస్థ కియా ఇండియా ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.కేవలం రెండేళ్లలోనే కియా ఇండియా స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ SUV కియా సోనెట్  మొత్తం 1.5 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపింది. సెప్టెంబరు 2020లో ప్రారంభించిన ఈ కార్ రెండు సంవత్సరాలలోపు ఈ వాహనం ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది. KIA మొత్తం అమ్మకాలలో 32శాతం కాంపాక్ట్ SUV సెగ్మెంట్ మోడల్‌గా ముందంజలో నిలిచింది. కియా సోనెట్ భారతదేశంలో ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(iMT) టెక్నాలజీతో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. మొత్తం 25శాతంపైగా సోనెట్ కొనుగోలుదారులు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో కూడిన వాహనాన్ని ఇష్టపడుతున్నారు. ఇక ఈ కాంపాక్ట్ SUV విభాగంలో మొత్తం దాదాపు 15శాతం వాటాతో కియా సోనెట్ గేమ్-ఛేంజర్ ప్రోడక్ట్ గా నిలిచింది.ఇక ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ, 'సోనెట్ కియా ఇండియాకి 1.5 లక్షల మంది కస్టమర్లు ఉండడం పట్ల మేం సంతోషంగా ఉన్నాం. కస్టమర్ అభిరుచులకు నచ్చిన విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము'. ఇక ఈ సెగ్మెంట్‌లో డీజిల్ AT మాత్రమే ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో, మేము సోనెట్ తక్కువ వేరియంట్‌లలో కూడా 4 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా జోడించాము. ఇక ఇది వాహనం భద్రతను కూడా మరింత మెరుగుపరుస్తుంది. అదే కారణంగా ప్రజాదరణ పెరిగిందని కూడా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ పేర్కొన్నారు.


అలాగే సోనెట్ కస్టమర్‌లు వాహనం టాప్ వేరియంట్‌ల పట్ల గొప్ప అనుబంధాన్ని కనబరిచారు, దాని మొత్తం అమ్మకాలలో 26 శాతంకి వారు సహకరించారు. 22శాతం కొనుగోలుదారులు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో తమ సోనెట్‌ను బాగా ఇష్టపడతారు కాబట్టి, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను సోనెట్ విక్రయాలలో కూడా మనం గమనించవచ్చు. సోనెట్ కార్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో కూడా ప్రసిద్ధి చెందింది. సోనెట్‌ గ్లేసియర్ వైట్ పెర్ల్ ఇంకా అరోరా బ్లాక్ పెర్ల్ రెండు రకాల కలర్స్ ఉన్నాయి. ఇన్నోవేషన్ ఇంకా స్టైలిష్ లుక్‌ల తోపాటు, కియా సోనెట్ నమ్మకంగా ఇంకా కాంపాక్ట్ బాడీలో డైనమిక్ అట్టిట్యూడ్ ని అందిస్తుంది. కియా సోనెట్ టెక్ లైన్ ఇంకా GT-లైన్ డ్యూయల్ ట్రిమ్ కాన్సెప్ట్‌తో ఈ విభాగంలో వాస్తవంగా అన్ని అవసరాలకు అనుగుణంగా బహుళ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో దీన్ని అందించనున్నారు.అలాగే భద్రతా సమస్యలు పెరుగుతున్నందున, సోనెట్ కార్ తక్కువ వేరియంట్‌ లలో కూడా కనిష్టంగా నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: