ఇక వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2022 మారుతి బ్రెజ్జా' (2022 maruti Brezza) రేపు (2022 జూన్ 30) అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ కొత్త 2022 బ్రెజ్జా ఎస్‌యూవీకు సంబంధించిన చాలా వివరాలు కూడా ఇప్పటికే వెల్లడయ్యాయి. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ పరిమాణానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.ఇక ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం, 2022 విటారా బ్రెజ్జా ఎస్‌యూవీ మొత్తం 10 వేరియంట్స్ లో విడుదలకానున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇందులో 7 మాన్యువల్ వేరియంట్‌లు (LXI, LXI (O), VXI, VXI (O), ZXI, ZXI (O), ఇంకా ZXI+) కాగా, మిగిలిన 3 ఆటోమేటిక్ వేరియంట్‌లు (VXI, ZXI ఇంకా ZXI+). ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా అలాగే పరికరాలను కూడా పొందుతాయి.ఇక కంపెనీ ఈ కొత్త ఎస్‌యువి కోసం బుకింగ్స్ ని స్వీకరించడం కూడా ప్రారంభించింది.అలాగే కొనుగోలుదారులు కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో గాని రూ. 11,000 చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకా కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించగలిగింది.


ఇక దీన్ని బట్టి చూస్తే కొత్త 2022 బ్రెజ్జా తప్పకుండా విపరీతమైన ప్రజాదరణ పొందుతుందని కూడా అనిపిస్తుంది.ఇక కంపెనీ వెల్లడించిన సమాచారాన్ని బట్టి 2022 మారుతి బ్రెజ్జా పొడవు 3,995 మిమీ వెడల్పు 1,790 మిమీ ఇంకా అలాగే ఎత్తు 1,685 మిమీ వరకు ఉంటుంది. ఇక వీల్‌బేస్ విషయానికి వస్తే ఇది 2,500 మిమీ వరకు కూడా ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు ఈ కార్ చాలా అనుకూలంగా ఉంటుంది.ఇక ఈ కొత్త SUV కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, కంపెనీ 2022 వితారా బ్రెజ్జా 6 మోనోటోన్ కలర్స్ లో ఇంకా 3 డ్యూయెల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది. మోనోటోన్ కలర్ ఆప్సన్స్ లో పెర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ స్ప్లెండిడ్ సిల్వర్, మెటాలిక్ మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, ఎక్సుబరెంట్ బ్లూ ఇంకా అలాగే పెర్ల్ బ్రేవ్ ఖాకీ వంటివి ఉన్నాయి. డ్యూయెల్ టోన్ కలర్స్ లో సిజ్లింగ్ రెడ్ & బ్లాక్, వైట్ & ఖాకీ బ్రేవ్ ఇంకా అలాగే బ్లాక్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: