ఇక ఈ ఏడాది మారుతి సుజుకి కంపెనీ అనేక అప్‌గ్రేడెడ్ మోడళ్లను విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే బాలెనో, వ్యాగన్ఆర్, ఎర్టిగా, ఎక్స్ఎల్6, బ్రెజ్జా ఇంకా ఎస్-ప్రెస్సో మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను విడుదల చేసింది.కాగా, ఇప్పుడు మారుతి సుజుకి కంపెనీ దేశంలోనే అత్యధికంగా విక్రయించే కారు అయిన ఆల్టో హ్యాచ్‌బ్యాక్ లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్ ను విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో ఇండియన్ రోడ్లపై అనేక సార్లు టెస్టింగ్ దశలో ఉండగా గుర్తించబడింది. అయితే ఇక మొదటిసారిగా ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా ఈ ఎస్‌యూవీ కెమెరాకు చిక్కింది. కొత్త ఆల్టో కోసం టెలివిజన్ కమర్షియల్ (టివిసి) చిత్రీకరిస్తుండగా ఈ కార్ కెమెరా కంటపడింది.ఇక మారుతి సుజుకి తమ కొత్త తరం ఆల్టో కోసం టెలివిజన్ కమర్షియల్ ను షూట్ చేయడాన్ని చూస్తుంటే, త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, కొత్త ఆల్టో కార్ వచ్చే ఆగస్ట్ నెలలో విడుదల కావచ్చని సమాచారం తెలుస్తోంది.


ఇక కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కారు ముందు ఇంకా వెనుక వైపు కొత్త బంపర్ డిజైన్, బాడీ-కలర్ పిల్లర్లు మరియు డోర్ హ్యాండిల్స్, సిల్వర్ వీల్ కవర్‌లతో ఉండే స్టీల్ వీల్స్, ట్రెడిషనల్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, కొత్త టైల్‌లైట్లు ఇంకా అలాగే వెనుక బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ అలాగే రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.ఇక కొత్త ఆల్టో కారు బ్లూ మరియు రెడ్ కలర్ ఆప్షన్‌లలో ఉంది. ఇవి కాకుండా, కంపెనీ మరిన్ని కొత్త కలర్ ఆప్షన్లను కూడా జోడించే అవకాశం ఉంది. కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో హ్యాచ్‌బ్యాక్ ను కూడా కంపెనీ హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫారమ్‌ పైనే ఆధారపడి ఉంటుందని సమాచారం. ప్రస్తుత ఈ మోడల్ 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగిస్తుండగా, ఈ అప్‌గ్రేడెడ్ మోడల్ లో ఇదే ఇంజన్ ను అప్‌డేట్ చేసి కొత్తగా ఆఫర్ చేసే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: