ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ వాహన రంగంలో చాలా వేగంగా దూసుకుపోతోంది. ఈ కంపెనీ ఇక సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వాహనాలను తయారు చేస్తుంటుంది.ఇక మారుతి కార్ అభిమానులకు రెండు గుడ్‌న్యూస్‌లు ఇంకా ఒక బ్యాడ్‌ న్యూస్‌ ఉన్నాయి.అవేంటంటే ఇక మారుతి ఎర్టిగాను రెండు కొత్త ఉపయోగకరమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది.తమ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఫీచర్లు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే కంపెనీ కారు ధరను కాస్త పెంచడం జరిగింది.ఇక దీని కారణంగా ఇప్పుడు వినియోగదారులు రూ. 6000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అన్ని ఎర్టిగా వేరియంట్లలో ఇప్పుడు ‘ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్’ (ESP) ఇంకా అలాగే ‘మౌంటైన్ గ్రిప్’ ఫీచర్లు అందుబాటులోకి రానున్నట్లు మారుతి సుజుకి ఇండియా గత రెండు రోజుల కిందట వెల్లడించింది. 


కంపెనీ ఇంతకుముందు ఈ ఫీచర్లను ఆటోమేటిక్ ఇంకా అలాగే టాప్-ఎండ్ మోడళ్లలో మాత్రమే అందించేంది. ఎర్టిగా అన్ని వేరియంట్‌లు ఇప్పుడు ESP ఇంకా మౌంటెన్ గ్రిప్ ఫీచర్‌తో అమర్చబడి ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇప్పుడు దీని ధర వచ్చేసి రూ. 8.41 లక్షలు (ఢిల్లీ-ఎక్స్‌షోరూమ్‌)గా ఉంటుందని మారుతి సుజుకీ కంపెనీ తెలిపింది.మారుతి సుజుకి ఎర్టిగా 2022 అనేక మార్పులతో ఈ సంవత్సరం ప్రారంభంలో అధికారికంగా కూడా ప్రారంభించబడింది. మారుతి ఎర్టిగా టాప్-ఆఫ్-లైన్ ZXi వేరియంట్‌లో CNGని అందించడం అసలు ఇదే మొదటిసారి. MPV నాలుగు ట్రిమ్‌లు మొత్తం 11 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇంకా అలాగే VXi, ZXi, ZXi+లో మూడు ఆటోమేటిక్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే cng కూడా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.ఇక ఈ ఎర్టిగా మునుపటి కంటే మెరుగైన K-సిరీస్ 1.5-లీటర్ డ్యూయల్ VVT ఇంజన్‌ని పొందుతుంది. ఎమ్‌పివిలో లభించే మైలేజీని మరింత పెంచేందుకు మారుతి కంపెనీ దీనిని రూపొందించింది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనేది అందుబాటులో ఉంది. అలాగే మునుపటి వేరియంట్‌ 4-స్పీడ్ ఇంకా ఆటోమేటిక్ యూనిట్ 6-స్పీడ్ యూనిట్ ద్వారా భర్తీ చేయబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: