ఇక గ్రాండ్ విటారా లాంచ్‌తో 2022 ఆర్థిక సంవత్సరాన్ని గ్రాండ్‌గా ప్రారంభించిన మారుతి సుజుకి, ఇప్పుడు మరో పెద్ద లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మారుతి సుజుకి తమ మోడళ్లలో అనేక ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను కూడా విడుదల చేసింది.అయితే, ఈసారి మాత్రం పూర్తిగా సరికొత్త మోడల్‌గా వచ్చింది గ్రాండ్ విటారా మాత్రమే. ఇది బ్రెజ్జా ఆధారంగా తయారు చేయబడిన పొడవాటి మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఇంకా అలాగే మారుతి సుజుకి మొట్టమొదటి హైబ్రిడ్ ఇంకా మొట్టమొదటి ఆల్-వీల్ డ్రైవ్ కారు. ఈ గ్రాండ్ విటారా తర్వాత మారుతి సుజుకి నుండి కాబోయే అతిపెద్ద కార్ లాంచ్ కొత్త తరం ఆల్టో కె10 (Alto K10).ఇక మారుతి సుజుకి తమ చిన్న ఆల్టో 800 మోడల్‌ని విడుదల చేసిన తర్వాత పెద్ద ఆల్టో కె10 గురించి మర్చిపోయింది. అందుకే ఈ మోడల్‌ను మార్కెట్లో నిలిపివేసింది. అయితే, ఇప్పుడు కొనుగోలుదారులు కాస్తంత ధర ఎక్కువైనా పర్వాలేదు పెద్దగా ఇంకా సౌకర్యవంతంగా అలాగే సురక్షితంగా ఉండే కార్లను మాత్రమే కోరుకుంటున్నారు.మరోవైపు ప్రభుత్వం కార్ల సేఫ్టీ విషయంలో కూడా తయారీదారులపై ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో, కార్ కంపెనీలు తమ కార్లను మరింత సమర్థవంతంగా ఉండేలా కూడా తీర్చిదిద్దుతున్నాయి.ఇక ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి కూడా తమ చిన్న కార్ లైనప్‌ను అప్‌గ్రేడ్ చేసి, నేటి ఆధునిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా దీన్ని తయారు చేస్తోంది. మారుతి సుజుకి ఇప్పటికే తమ ఆల్టో 800 సిరీస్‌లో అనేక వేరియంట్లను కూడా డిస్‌కంటిన్యూ చేసింది.


అలాగే మరోవైపు, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచిన ఆల్టో అమ్మకాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న మారుతి సుజుకి, తమ పాత ఆల్టో కె10 ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి విడుదల చేయాలని చూస్తోంది.ఈ రాబోయే కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ మొత్తం 12 వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుందని ధృవీకరించే కొన్ని లీకైన సమాచారం ఉన్నప్పటికీ, ఇంకా గతంలో లీకైన NCT రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రం ఈ కొత్త ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ కేవలం 11 వేరియంట్‌లలో మాత్రం అందుబాటులో ఉంటుందని వెల్లడిస్తున్నాయి. ఇక తాజాగా లీకైన NCT రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, వీటిలో 6 వేరియంట్‌లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడి ఉంటాయి, అయితే మిగిలిన 5 వేరియంట్‌లు అనేవి 5-స్పీడ్ AMT యూనిట్ (AGS-ఆటో గేర్ షిఫ్ట్) తో అమర్చబడి ఉంటాయి.మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ను కంపెనీ కొత్త మాడ్యులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ పై ఆధారపడి నిర్మించబడుతుంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌ పై తయారైన ఆల్టో కె10 ప్రస్తుత ఆల్టో 800 కంటే కొంచెం పెద్దదిగా కూడా ఉంటుంది. ఇక ఈ NCT రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నుండి లీక్ అయిన స్పెసిఫికేషన్ల ప్రకారం, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ 3,530 మిమీ పొడవు, 1,490 మిమీ వెడల్పు ఇంకా 1,520 మిమీ ఎత్తును కలిగి ఉంది.అలాగే, కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 వీల్‌బేస్ 2,380 మిమీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: