'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు తన 'టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి' (Tigor XM iCNG) వేరియంట్ విడుదల చేసింది.ఈ కొత్త వేరియంట్ ధర వచ్చేసి రూ. 7.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇక ప్రస్తుతం మార్కెట్లో సిఎన్‌జి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ వేరియంట్ విడుదల చేయడం జరిగింది.టాటా మోటార్స్ కంపెనీ భారతీయ మార్కెట్లో తన అమ్మకాలను మెరుగుపరుచుకోవడానికి ఇంకా అలాగే ఈ విభాగంలో తన ఉనికిని మరింత బలపరుచుకోవడానికి కంపెనీ టియాగో ఇంకా టిగోర్‌లలో ఐసిఎన్‌జి టెక్నాలజీని ప్రవేశపెట్టింది.ఇక దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి' వేరియంట్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి ఒపల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ ఇంకా డీప్ రెడ్ కలర్స్.ఇక ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్శణీయంగా ఉంటాయి.మార్కెట్లో కంపెనీ  సిఎన్‌జి వేరియంట్స్ అమ్మకాలు పెరగటంతో ఈ కొత్త టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి వేరియంట్ ని మరింత సరసమైన ధర వద్ద విడుదల చేసింది.టాటా టిగోర్  ఎంట్రీ-లెవల్ XM iCNG వేరియంట్ ఆకర్షణీయమైన డిజైన్ ఇంకా అలాగే ఫీచర్స్ పొందుతుంది.


అలాగే ఇందులో 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్ ఇంకా అలాగే హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇంకా అంతే కాకుండా యావరేజ్ మైలేజ్, సీట్ బెల్ట్ రిమైండర్ అలాగే గేర్ షిఫ్ట్ డిస్‌ప్లే మొదలైన సమాచారాన్ని అందించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.ఈ కొత్త టాటా టిగోర్ సిఎన్‌జి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇది 73.4 బిహెచ్‌పి పవర్ ఇంకా అలాగే 95 ఎన్ఎమ్ టార్క్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.ఇంకా అలాగే ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కి కూడా జతచేయబడి ఉంటుంది.ఈ కొత్త టాటా టిగోర్ సిఎన్‌జి అనేది cng మోడల్ కావున దీని బూట్ స్పేస్ 205 లీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. అయితే సాధారణ మోడల్ లో బూట్ స్పేస్ 419 లీటర్ల వరకు కూడా ఉంటుంది. అదే సమయంలో cng మోడల్  గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు కూడా ఉంటుంది. టాటా టిగోర్ సిఎన్‌జిలో 35-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ తో పాటు ఇంకా cng కి 60-లీటర్స్ జత చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: