ఇండియన్ మార్కెట్లో టూ వీలర్లకు పెరుగుతున్న ఆదరణ ఇప్పుడు అసలు అంతా ఇంతా కాదు. అయితే ఈ ప్రస్తుతం చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేసి ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని కూడా చూపించడానికి తగిన ప్లాన్ లు రెడీ చేసుకుంటున్నాయి.ఇక ఇండియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ 'హోప్ ఎలక్ట్రిక్' ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి తయారైంది.హోప్ ఎలక్ట్రిక్ కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో తన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'హోప్ ఆక్సో' విడుదల చేయడానికి రెడీ అయిపోయింది. కంపెనీ ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను గురుగ్రామ్‌లో 2022 సెప్టెంబర్ 05 న అధికారికంగా విడుదల చేయనుంది.హోప్ మొబిలిటీ ఇప్పటికే తన రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నుండి ధృవీకరణ పొందింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ (పిఎల్‌ఐ స్కీమ్) ద్వారా దేశంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి సిద్ధమైంది.కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త HOP OXO అనేది ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఒక హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌.


 ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది. దీనికోసం కంపెనీ ఈ బైక్‌లో అధిక సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని వినియోగిస్తుంది. కావున ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ గరిష్టంగా 150 కిమీల పరిధిని అందిస్తుంది.హోప్ ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఇప్పటికే దాదాపు భారతదేశంలోని 20 నగరాల్లో 30,000 కిమీ కంటే ఎక్కువ డ్రైవ్ చేసి పరీక్షించినట్లు కూడా తెలిపింది. అంతే కాకుండా ఈ టెస్టింగ్ సమయంలో వెలువడిన చిత్రాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కావున ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.కంపెనీ సంవత్సరానికి 1.8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం కంపెనీ LEO , LYF రేంజ్ స్కూటర్లను తయారుచేయడంలో నిమగ్నమై ఉంది. అయితే త్వరలోనే LYF2.0 ఇంకా OXO వాహనాలు ఈ ప్లాంట్‌లో చేయబడతాయి. కంపెనీ ప్రస్తుతం ఈ ప్లాంట్ లో 100 ఎలక్ట్రిక్ వాహనాలను చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: