ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి పెరుగుతున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) కూడా ఈవీ విభాగంలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తోంది.ఫోక్స్‌వ్యాగన్  కొత్త ఎలక్ట్రిక్ కారు ID.4 GTX హై-పెర్ఫార్మెన్స్ వేరియంట్  స్పై చిత్రాలు ఇటీవల ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ఫోక్స్‌వ్యాగన్ ఐడి.4 కంపెనీ  మిగిలిన ID లైనప్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన VW ID క్రాస్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఈ కారు యూఎస్, జర్మనీ ఇంకా చైనా దేశాలో తయారు చేయబడుతోంది.ఇందులోని 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆఫర్ చేసే స్కోడా మరియు ఆడి వంటి ప్రీమియం కార్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఫోక్స్‌వ్యాగన్ గ్రూపులో భాగమైన ఆడి ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించి, విజయవంతంగా వ్యాపారం చేస్తోంది.ఇండియాలో ఆడి ఇ-ట్రాన్ హాట్ కేకుల్లా అమ్మువుతోంది. ఇంకా అలాగే కంపెనీ  బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఆడి ఇ-ట్రోన్ రేంజ్ తో కొత్త స్కోడా ఎన్యాక్ రేంజ్ దాదాపు సమానంగా ఉంటుంది.


భారత రోడ్లపై volkswagen ID.4 GTX ఇంకా Skoda Enyaq iV 80X రెండు మోడళ్లు కూడా వాటి వివరాలు కనిపించకుండా ఉండే, పూర్తి క్యామోఫ్లేజ్ తో పరీక్షించబడుతున్నాయి.అలాగే ఫోక్స్‌వ్యాగన్ ఐడి4 ఈ విభాగంలో నేరుగా కియా ఈవీ6 తో పోటీ పడుతుంది.ఇంకా ఇది ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో విడుదల కాబోయే మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా కూడా ప్రచారం చేయబడుతోంది.ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అభివృద్ధి కోసం దేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా, జర్మన్ ఆటోమేజర్ ఫోక్స్‌వ్యాగన్ గ్రూపులు రెండూ చేతులు కలిపిన సంగతి తెలిసినదే.మహీంద్రా  INGLO ప్లాట్‌ఫారమ్ ఫోక్స్‌వ్యాగన్  MEB గ్లోబల్ స్కేలబుల్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫారమ్ VW ID.4 ఇంకా Skoda Enyaq వాహనాలను కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఈ రెండు టెస్ట్ వాహనాల్లో భారతీయ పరిస్థితుల కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌ని పరీక్షిస్తూ ఉండవచ్చని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: