జపనీస్ ఫేమస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న నింజా సిరీస్‌లో ఓ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను పరిచయం చేసింది. కవాసకి నింజా జెడ్ఆర్ 10ఆర్ లో కొత్త 2023 మోడల్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది.ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ స్పోర్ట్స్ బైక్ ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. గత సంవత్సరం కంపెనీ విడుదల చేసిన 2022 మోడల్ నింజా జెడ్ఎక్స్ 10ఆర్ ధరతో పోలిస్తే, ఈ కొత్త  మోడల్ ధర దాదాపు రూ.85,000 ఎక్కువగా ఉంది. అయితే, పెరిగిన ధరకు అనుగుణంగా కంపెనీ ఇందులో కొత్త ఫీచర్లు ఇంకా అలాగే పరికరాలను అందిస్తోంది. కొత్త  కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఒకే ఒక వేరియంట్‌లో, ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది.ఇక కొత్త  కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఈ జపనీస్ బ్రాండ్  సిగ్నేచర్ లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌తో పాటుగా పెరల్ రోబోటిక్ వైట్ అనే మరో కలర్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ కొత్త మోడల్ మోటార్‌సైకిల్‌ను మరింత 'రేస్' స్పెక్ మోడల్‌లా కనిపించేలా చేయడానికి కంపెనీ ఇందులో సరికొత్త గ్రాఫిక్స్‌ను జోడించింది.  ఇది దాదాపు మునుపటి మోడల్ లాగానే కనిపిస్తుంది.కవాసకి ఇంజనీర్లు ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను కొంచెం పోటీగా  మార్చడానికి ఇందులో కొన్ని మార్పులు చేశారు. 


కొత్త  కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ సూపర్‌బైక్ అదే ట్విన్-స్పార్ టైప్ కాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగించడం కొనసాగిస్తుంది, పెద్ద 17 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మరియు పూర్తి ఫెయిరింగ్‌తో గంభీరమైన రోడ్ ప్రజెన్స్‌ని కలిగి ఉంటుంది. ఈ ఫెయిరింగ్ పాత మోడల్‌లా కనిపించినప్పటికీ, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ముందు భాగంలో స్థిరంగా ఉంచడానికి ఇంకా అదనపు డౌన్‌ఫోర్స్‌ను అందించడానికి ఇది ఇంటిగ్రేటెడ్ వింగ్‌లెట్‌లను కలిగి ఉంటుంది.ఇక కొత్త  కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ సూపర్‌బైక్ ఇప్పుడు కొత్త 'ర్యామ్ ఇంటేక్'తో కూడా వస్తుంది. ఇందులోని ట్విన్-పాడ్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, సొగసైన టెయిల్ ల్యాంప్, తక్కువ ఎయిర్ డ్రాగ్ కోసం పెద్ద విండ్‌స్క్రీన్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌లో కొత్తగా చేర్చిన ఫీచర్ ఏంటంటే, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4.3 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌. రైడర్ తన స్మార్ట్‌ఫోన్ సాయంతో మోటార్‌సైకిల్‌కు రిమోట్‌గా కనెక్ట్ అయిన అనేక రకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ ఫీచర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: