ఇండియన్ ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ 'టాటా మోటార్స్' మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందతున్న సఫారీ మోడల్ లో మరో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్స్ లో ఒకటి టాటా సఫారి XMAS కాగా, మరొకటి టాటా సఫారి XMS.టాటా మోటార్స్  కొత్త సఫారీ వేరియంట్స్  ప్రారంభ ధరలు రూ. 17.96 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అయితే ఇప్పుడు ఈ కొత్త వేరియంట్స్ ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకూండా కంపెనీ ఇప్పుడు ఈ కొత్త సఫారీ వేరియంట్‌లను #ReclaimYourLife అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచారం చేస్తోంది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సఫారీ వేరియంట్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ  అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.కంపెనీ ఈ రెండు కొత్త వేరియంట్స్ లాంచ్ చేస్తూ.. ఈ అప్డేటెడ్ కార్లను అన్‌చార్టర్డ్ భూభాగాలలో ప్రయాణించడానికి ఇంకా #Reclaim YourLife కోసం ఇప్పుడే https://cars.tatamotors.com/suv/safari బుక్ చేసుకోండి, అంటూ టాటా మోటార్స్ కార్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.ప్రస్తుతం టాటా సఫారీ  XMAS ఇంకా XMS వేరియంట్‌లు ఆటోమేటిక్ ఇంకా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. 


ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ప్రారంభ ధరలు ధర రూ. 17.96 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్  ప్రారంభ ధరలు రూ. 19.26 లక్షలు (ఎక్స్-షోరూమ్).టాటా సఫారీ కొత్త వేరియంట్స్ రెండూ కూడా క్రయోటెక్ 170 పిఎస్ డీజిల్ ఇంజన్ పొందుతాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి. అయితే ఈ వేరియంట్స్  డిజైన్ ఇంకా కొన్ని ఫీచర్స్ మునుపటి మాదిరిగానే ఉన్నాయి.అయితే ఇందులో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్‌లలో పనోరమిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 8 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ ఇంకా అలాగే రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.ఇప్పటికే భారతీయ మార్కెట్లో టాటా సఫారీ స్టాండర్డ్, డార్క్  ఇంకా అడ్వెంచర్ పర్సోనా అనే వేరియంట్స్ లో అమ్ముడవుతోంది. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్స్ కూడా చేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: