ఫేమస్ ఇండియన్ కార్ల కంపెనీ అయిన 'టాటా మోటార్స్'  ఇండియన్ మార్కెట్లో ఎట్టకేలకు రెండు కొత్త 'హారియర్' వేరియంట్లను విడుదల చేసింది.అవి ఒకటి హారియర్ XMAS కాగా, మరొకటి హారియర్ XMS వేరియంట్స్.టాటా మోటార్స్  హారియర్ XMAS ధర రూ. 18.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, హారియర్ XMS ధర రూ. 17.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి రెండు వేరియంట్లు కొత్త డిజైన్ ఇంకా పరికరాలను పొందుతాయి.టాటా హారియర్ XMS వేరియంట్ అనేది XM ఇంకా XT వేరియంట్‌ల మధ్య ఉంటుంది. అంతే కాకూండా ఇది కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే హారియర్ XMAS వేరియంట్ XMA అలాగే XTA+ వేరియంట్‌ల మధ్య ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.కొత్త టాటా హారియర్ XMS ఇంకా XMAS వేరియంట్లు ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. అందువల్ల ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇంకా రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి వాటితోపాటు ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.


ఇది ఆపిల్ కార్ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.నిజానికి పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఇప్పటివరకు హారియర్  XT+ ఇంకా XTA+ వేరియంట్‌లలో అందుబాటులో ఉండేది. అయితే ఈ ఫీచర్ ఉండటం వల్ల ఈ వేరియంట్స్ ధరలు వరుసగా రూ. 18.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఇంకా రూ. 19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు కంపెనీ విడుదల చేసిన కొత్త వేరియంట్స్ (XMS ఇంకా XMAS) లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. కాగా ధరలు కూడా XT+ ఇంకా XTA+ వేరియంట్స్ కంటే కూడా రూ. 1 లక్ష తక్కువగా ఉంటుంది.టాటా హారియర్ లో ఇప్పుడు సన్‌రూఫ్ ఫీచర్ కావాలనుకునే వారు, ఇప్పుడు XMS ఇంకా XMAS వేరియంట్స్ కొనుగోలుతో ఒక రూ. 1 లక్ష దాకా కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: