జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఏ4 సెడాన్‌ లో కంపెనీ ఇప్పుడు కొత్త 2022 మోడల్‌ను విడుదల చేసింది.కొత్త 2022 మోడల్ ఆడి ఏ4 ఇప్పుడు కాస్మెటిక్ ఇంకా ఫీచర్ అప్‌గ్రేడ్స్ తో పాటుగా కొత్త కలర్ ఆప్షన్లను కూడా పొందింది.కొత్త ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ ఇప్పుడు ప్రీమియం, ప్రీమియం ప్లస్ ఇంకా టెక్నాలజీ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.43.12 (ఎక్స్-షోరూమ్) లక్షల నుండి ప్రారంభం అవుతాయి.కొత్త 2022 ఆడి ఏ4 ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్లను పొందింది. వీటిలో టాంగో రెడ్ ఇంకా మ్యాన్‌హాటన్ గ్రే కలర్ ఆప్షన్లు. ఇందులో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్ల విషయానికి వస్తే, ఆడి ఏ4 టెక్నాలజీ వేరియంట్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఇంకా 19 స్పీకర్లతో కూడిన బి అండ్ ఓ (B&O) ప్రీమియం సౌండ్ సిస్టమ్ ను పొందుతుంది. ఆడి గతేడాది జనవరి నెలలో తమ 2021 ఏ4 సెడాన్‌ను విడుదల చేసింది. కాగా, ఇప్పుడు వచ్చిన కొత్త 2022 ఏ4 సెడాన్ కూడా అలానే ఉంటుంది. దీని డిజైన్ ఇంకా ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.


ఆడి ఏ4 సెడాన్‌లో లభించే ఇతర ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ లగ్జరీ కారులో ఆడి వర్చువల్ కాక్‌పిట్ డిస్‌ప్లే, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ గ్లాస్ సన్‌రూఫ్, 30-కలర్ యాంబియంట్ లైటింగ్ ఇంకా ప్రీమియం లెథర్ ఇంటీరియర్స్, ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా ఇంకా ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది.ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ శక్తివంతమైన 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ మాక్సిమం 190 బిహెచ్‌పి పవర్ ను ఇంకా 320 ఎన్ఎమ్ మాక్సిమం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇంకా ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వచ్చే శక్తిని చక్రాలకు పంపిణీ చేస్తుంది.


పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 7.3 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది.మాక్సిమం గంటకు 241 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది.ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్‌ప్లే టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా అనుమతిస్తుంది. ఇంకా ఇందులో స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్, డ్రైవర్ సమాచారం కోసం డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రేమ్‌లెస్ ఇంకా యాంటీ-గ్లేర్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: