మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'స్కార్పియో-ఎన్' (Scorpio-N) కార్ ఎంత ప్రజాదరణ పొందుతోంది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే అత్యధిక బుకింగ్స్ పొంది, బుకింగ్స్ లో ఒక కొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా ఇటీవల కంపెనీ ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ SUV లను డెలివరీ చేసింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఒక మహీంద్రా డీలర్ ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ వాహనాలను డెలివరీ చేసి ఒక అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ మెగా డెలివరీ ఈవెంట్ లో కస్టమర్లందరికి కూడా కార్ తాళాలు అందించారు. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక మహీంద్రా స్కార్పియో-ఎన్‌ మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి Z2, Z4, Z6, Z8 ఇంకా Z8L వేరియంట్స్.


వీటి ప్రారంభ ధరలు రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 23.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు ఇంకా 7-సీట్ల తో అందుబాటులో ఉంటుంది.కంపెనీ ఇప్పటికే ఒక లక్షకు పైగా బుకింగ్స్ కూడా పొందింది. అందువల్ల డెలివరీలు వేగంగా జరపడానికి కంపెనీ తగిన సన్నాహాలు చేస్తుంది. కాగా కంపెనీ వెల్లడించిన ధరలు మొదటి 25,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయాభి ఉన్నాయి. ఆ తరువాత ధరలు పెరుగుతాయి. ఈ విషయం కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్  లో అందుబాటులో ఉంది. అవి ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, రెండవది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇందులోని మొదటి ఇంజిన్ 175 పిఎస్ పవర్ ఇంకా 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ఇంకా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విక్రయించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: