చైనా కార్ తయారీ కంపెనీ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఇండియన్ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ SUV 'ఆటో 3' (Atto 3) ని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసింది.ఇక ఈ కంపెనీ త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ SUV  ధరలను కూడా ప్రకటించనుంది. ఇప్పటికే కార్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అందువల్ల డెలివరీలు 2023 జనవరిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.ఇక BYD కంపెనీ తన ఎలక్ట్రిక్ SUV ని ఇండియన్ మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో అమ్మడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ కావలసిన సంఖ్యలో షోరూమ్‌లను కూడా ప్రారంభిస్తోంది. ఇప్పటికే 12 షోరూమ్‌లను కలిగి ఉన్న కంపెనీ 2022 చివరి నాటికి 23 షోరూమ్‌లను రెడీ చేయడానికి తగిన ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంటోంది.అయితే ఇప్పటికే కంపెనీ చెన్నై, బెంగళూరు ఇంకా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో షోరూమ్‌లను ప్రారంభించింది. BYD ఆటో 3 రాబోయే 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. 2022 అక్టోబరు 31 వ తేదీన కంపెనీ చెన్నైలో షోరూమ్ స్టార్ట్ చేసింది.


ఈ షోరూం ఏకంగా 20,000 అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ద్వారా సేల్స్, స్పేర్స్ ఇంకా సర్వీస్ వంటివి కూడా జరుగుతాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 12 షోరూమ్‌లలో చెన్నై షోరూమ్ అయితే చాలా పెద్దది.కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ కారు 'ఆటో 3' (Atto 3) కోసం బుకింగ్స్ తీసుకోవడం కూడా ప్రారంభించింది. ఇందుకు ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న మొదటి 500 మంది కస్టమర్లకు 2023 జనవరి నాటికి డెలివరీ చేయనున్నట్లు కూడా కంపెనీ అనౌన్స్ చేసింది.BYD ఇండియా చెన్నై దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లోని ప్లాంట్‌లో సెమీ-నాక్డ్ డౌన్ (SKD) కిట్‌ల నుండి Atto 3 ని అసెంబుల్ చేస్తుంది. ఇది ప్రస్తుతం 10,000 యూనిట్ల యాన్యూవల్ పవర్ ని కలిగి ఉంది. ఇంకా అంతే కాకుండా ఇందులో మూడు షిఫ్ట్‌లలో 15,000 యూనిట్లకు విస్తరించడానికి కూడా కంపెనీ తగిన ప్లాన్లు చేస్తోంది. 2023 సంవత్సరంలో కంపెనీ ఏకంగా 15,000 అటో 3 కార్లను అమ్మాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: