మన ఇండియాలో బజాజ్‌ పల్సర్‌కి యూత్‌లో ఎంత గొప్ప క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఇండియాలో మకుటం లేని మహారాజుగా పల్సర్ బైక్ దూసుకుపోతుంది. ఇంకా అంతే కాకుండా బజాజ్‌ కంపెనీలో చాలా ఎక్కువగా అమ్ముడు పోయిన బైక్‌గా పల్సర్‌ బండికి చాలా మంచి పేరు ఉంది.ఇండియాలో ఎన్ని స్పోర్ట్స్  బైక్స్ వచ్చినా కానీ పల్సర్  బైక్  క్రేజ్ ని మాత్రం ఏ బైక్  కూడా మ్యాచ్ చెయ్యలేదు.అయితే తాజాగా బజాజ్‌ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి కొత్త పల్సర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. రేసింగ్ రెడ్‌, ఎబోనీ బ్లాక్‌ బ్లూ, ఎబోనీ బ్లాక్‌ వైట్‌, ఎబోనీ బ్లాక్‌ రెడ్‌, కరేబియన్‌ బ్లూ ఇలా మొత్తం 5 రంగుల్లో ఈ బైక్‌ను లాంచ్  చెయ్యడం జరిగింది.డ్యూయల్‌ డిస్క్‌లు వున్న ఈ బైక్‌లో వెనకాల సీట్ కాస్త హైట్‌ గా ఉండేలా మంచి స్పోర్ట్స్‌ లుక్‌లో డిజైన్‌ చేశారు. ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌తో పాటు యూసీబీ ఛార్జింగ్ పోర్ట్‌ లాంటి సరికొత్త ఫీచర్లను అందించారు.


150 సీసీ సెగ్మెంట్‌లో మరింత మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకునే బజాజ్‌ ఈ బైక్‌ను తీసుకొచ్చింది.ఇక ఈ బైక్‌లో 149 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌ ఉంది.ఈ ఇంజన్‌ 8500 ఆర్‌పీఎమ్‌ వద్ద 14.5 హెచ్‌పీని విడుదల చేస్తుంది. 14 లీటర్ల పెట్రోల్‌ కెపాసిటీ ఈ బైక్‌ కి ఉంది.ఇంకా అలాగే గ్రౌండ్ క్లియరెన్స్‌ 165 ఎమ్‌ఎమ్‌గా ఉంది. సింగల్‌, డ్యూయల్‌ డిస్క్‌ వేరియంట్స్‌లో ఈ బైక్‌ను లాంచ్‌ చేయ్యడం జరిగింది. ఇక ఈ బైక్‌ ధర విషయానికొస్తే.. సింగిల్‌-డిస్క్‌ ఇంకా సింగిల్‌ సీట్‌ కలిగిన బైక్‌ ధర రూ.1.16 లక్షలు ఉండగా , ట్విన్‌-డిస్క్‌, స్లిట్‌ సీట్‌ మోడల్‌ ధర వచ్చేసి రూ.1,19,757 గా ఉంది. ఇక 150 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైకులో యూఎస్‌బీ మొబైల్‌ చార్జింగ్‌ పోర్ట్‌, గేర్‌ ఇండికేటర్‌ ఇంకా అలాగే సింగిల్‌ చానల్‌ ఏబీఎస్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీ వంటి ఫీచర్స్‌ ప్రత్యేకంగా వున్నాయి.ఖచ్చితంగా ఈ బైక్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: