ఇక ఇండియన్ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందిన 'ఫోక్స్‌వ్యాగన్ టైగన్' ఇప్పడు 'ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌'లో విడుదలవ్వడం జరిగింది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌' ధర వచ్చేసి రూ. 33.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది చూడటానికి దాదాపు దాని పాత మోడల్ లాగానే ఉన్నప్పటికీ ఇందులో మనం కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. అయితే ఇందులో యాంత్రికంగా మాత్రం ఎటువంటి మార్పులు జరగలేదు. అందువల్ల ఇది అదే ఇంజిన్ అదే పనితీరుని అందిస్తుంది.ఇక వాహన వినియోగదారులు ఇందులో పనితీరు తగ్గే అవకాశం ఉందా అని ఏమాత్రం కూడా ఆశలు సందేహపడాల్సిన అవసరం లేదు.ఇక ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ కార్ లో గమనించదగ్గ మరో పెద్ద హైలెట్ ఏమిటంటే.. దాని స్టాండర్డ్ మోడల్ లో కనిపించే 18 ఇంచెస్ వీల్స్ స్థానంలో 18 ఇంచెస్ ట్విన్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ అనేవి ఉన్నాయి. ఇంకా అంతే కాకుండా వీల్స్ కోసం డైనమిక్ హబ్‌క్యాప్‌లు ఇంకా వెనుక వైపున కొత్త లోడ్ సిల్ ప్రొటెక్షన్‌ వంటి వాటిని కూడా మనం గమనించవచ్చు. B-పిల్లర్‌ మీద ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ ని కూడా ఇందులో చూడవచ్చు.


ఫోక్స్‌వ్యాగన్ టైగన్ స్టాండర్డ్ మోడల్ ఏడు కలర్ ఆప్షన్లో లభిస్తే, కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ మొత్తం కూడా రెండు ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.అవి పెర్ల్ వైట్ ఇంకా ఓరిక్స్ వైట్ కలర్స్. ఇక డిజైన్ ఇంకా అలాగే ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా మార్పులు కనిపించే ఛాన్స్ లేదు. అందువల్ల ఇది దాని స్టాండర్డ్ మోడల్  లాగానే ఉంటుంది. అలాగే ఇందులో LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు కూడా ఉంటాయి.ఇక ఈ టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో కూడా అదే 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు, లెదర్ సీట్లు ఇంకా యాంబియంట్ లైటింగ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇంకా అలాగే పనోరమిక్ సన్‌రూఫ్‌ వంటివి ఉంటాయి.


అలాగే ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అండ్ డిసెంట్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఇంకా ఏబీఎన్ విత్ ఈబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి.టైగన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంకా అలాగే టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ కూడా ఉంటుంది. ఇది 190 హెచ్‌పి పవర్ ఇంకా అలాగే 320 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో యాడ్ చేయబడి ఉంటుంది. ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే, ఇది 12.65 కిమీ/లీ అందిస్తుందని ARAI ద్వారా వెరిఫై చెయ్యబడింది. అయితే ఈ కార్ మైలేజ్ సిటీ ఇంకా హైవే వంటి వాటిలో కొంత వ్యత్యాసం చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: