ఇక ఇండియన్ మార్కెట్లో విడుదలకు రెడీ అవుతున్న కొత్త సిట్రోయెన్ eC3 కార్ కోసం కంపెనీ బుకింగ్స్ ఓపెన్ చెయ్యడం ప్రారంభించింది. ఇప్పటికే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి దాదాపు మొత్తం సమాచారంని అందించింది.ఇక సిట్రోయెన్ కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, eC3 ఎలక్ట్రిక్ కార్ కావాలనుకునేవారు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.  ఇక ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు కంపెనీ  అధీకృత డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ  అధికారిక వెబ్‌సైట్ ద్వారా కార్ ని బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో డెలివరీలు త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి లైవ్ అండ్ ఫీల్ అనే రెండు వేరియంట్‌లలో విడుదలయ్యే అవకాశం ఉంది.సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కార్ 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇంకా అంతే కాకుండా బ్యాటరీ ప్యాక్ 56.2 బిహెచ్‌పి పవర్ ఇంకా అలాగే 143 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసి ఫ్రంట్ యాక్సిల్‌కు అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటారుకు మంచి శక్తినిస్తుంది. ఈ కార్ కేవలం 6.8 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ కారు మాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకు 107 కిమీ వరకు ఉంటుంది.eC3 ఎలక్ట్రిక్ కారులో ఎకో ఇంకా అలాగే స్టాండర్డ్ మోడ్స్ తో పాటు రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.


కార్ ఒక ఫుల్ ఛార్జ్ మీద ఏకంగా 320 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా వెరిఫై చేయబడింది.ఇక ఇది తప్పకుండా మంచి రేంజ్ ఇస్తుందని ఆశించవచ్చు.ఇక సిట్రోయెన్ eC3 ఛార్జింగ్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇది 15A ప్లగ్ పాయింట్‌లో ప్లగ్ చేయబడిన ఆన్‌బోర్డ్ 3.3kW AC సెటప్‌ని వాడి బ్యాటరీ ప్యాక్‌ను 10 నుండి 100 శాతం దాకా ఛార్జ్ చేయడానికి 10.5 గంటలు పడుతుంది. ఈ కార్ 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 57 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఈజీగా ఛార్జ్ చేసుకుంటుంది. అందువల్ల ఛార్జింగ్ సమయంలో కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ కార్ ఫీచర్స్ విషయానికి వస్తే, దీని డాష్ బోర్డు మధ్యలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అనేది ఉంటుంది. ఇది వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో ఇంకా అలాగే ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.అలాగే అంతే కాకుండా ఈ డిస్‌ప్లే 35 కి పైగా ఫీచర్స్ కనెక్ట్ చేయడానికి MyCitroen Connect యాప్‌ అనేది కూడా ఉంటుంది.దీనితో బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్, ఛార్జింగ్ స్టేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: