ఇక మార్కెట్లో cng వాహనాలు ఈమధ్య ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే టయోటా కంపెనీ ఇప్పటికే తన కార్లను cng వెర్షన్ లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ వెర్షన్ లోకి మరో కారుని కూడా తీసుకొచ్చింది.ఇక టయోటా కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన కొత్త cng మోడల్  హైరైడర్.గత కొన్ని రోజులుగా కంపెనీ ఈ cng వెర్షన్ గురించి డీటెయిల్స్ అందిస్తూనే ఉంది. అయితే ఇక ఈ రోజు  హైరైడర్ cng వెర్షన్ ని లాంచ్ చేసేసింది. ఈ కొత్త టయోటా హైరైడర్ cng ప్రారంభ ధర రూ. 13.23 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది.టయోటా హైరైడర్ cng మొత్తం రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి S ఇంకా M వేరియంట్స్. ఈ వేరియంట్స్ ధరలు  రూ. 13.23 లక్షలు నుంచి రూ. 15.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) దాకా ఉంటాయి. ఈ ధరలు దాని పాత మోడల్ అయిన పెట్రోల్ వేరియంట్స్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువగా ఉంటాయి.


అయితే cng వెర్షన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న పెట్రోల్ వేరియంట్స్ కంటే చాలా మంచి పనితీరుని అందిస్తాయి.టయోటా కంపెనీ  హైరైడర్ cng కోసం కంపెనీ ఇప్పటికి బుకింగ్స్ తీసుకోవడం కూడా ప్రారంభించింది. అందువల్ల రూ. 25,000 చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా దగ్గర్లో ఉన్న డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. నిజానికి టయోటా హైరైడర్ పెట్రోల్ మోడల్ నాలుగు వేరియంట్స్ (E, S, G ఇంకా V) లో మనకు లభిస్తుంది. అయితే cng వెర్షన్ కేవలం రెండు ట్రిమ్స్ (S, G) లో మాత్రమే మనకు లభిస్తుంది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టయోటా హైరైడర్ cng డిజైన్ దాని మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ వెర్షన్ లాగానే ఉంటుంది. అయితే లోపలి వైపు స్విచ్ గేర్ ఇంకా స్టీరింగ్ వీల్‌తో ఆల్ బ్లాక్ ఇంటీరియర్‌ పొందుతుంది. అయితే పెట్రోల్ వెర్షన్ కంటే cng వెర్షన్  బూట్ స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బూట్ స్పేస్ లో మొత్తం 60 లీటర్ల cng ట్యాంక్ అమర్చబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: