మన  భారతదేశంలో ఎన్నో  ఆలయాలు ఉన్నాయి.. అలాగే దేవాలయాలలో కనిపెట్టలేని మిస్టరీలు ఉన్నాయి. మిస్టరీలలో ఒక మిస్టరీ  ఆలయం ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం. సోమేశ్వర స్వామి ఆలయం అనగానే మనకు గుర్తుకొచ్చేది శివలింగం పై పడుతున్న 'నీడ'. అయితే ఈ నీడ శివలింగం మీద ఎలా పడుతుందో ఎవ్వరికి తెలీదు. ఎంతో మంది పరిశీలకులు పరిశీలించినా.. వీడని మిస్టరీ ఇప్పుడు బయట పడింది.


ఆలయంలో ఉన్న శివలింగం మీద నీడ పడుతుంది అది అందరికి తెలిసిందే.. మనం ఆలయంలోకి వెళ్లి దేవుడిని దర్శించుకుని మన కోరికలను దేవునికి చెప్పుకుని వస్తాము. కానీ ఒక టీచర్( మనోహర్ గౌడ్) మాత్రం అసలు ఈ శివలింగంపై నీడ ఎలా పడుతుంది అని ఆలోచించసాగాడు. ఎన్నో రోజులు నిద్రాహారాలు మాని ఆలయంలో కూర్చుని ప్రయోగాలు చేసి మిస్టరీని ఛేదించాడు టీచర్ మనోహర్.


ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్ అనే గ్రామంలో ఉంది. దీనిని కుందూరు చోళులు 11 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ గుడిలో 8 స్తంభాలుంటాయి. ఏ స్తంభం నీడ శివలింగం మీద పడుతుందో తేలీదు. ఒక స్తంభం నీడ పడుతుంది అని స్తంభం మీద చెయ్యి వేస్తే నీడ పడుతుంది కానీ మన చెయ్యి నీడ మాత్రం కనిపించదు. ఇది ఎలా సాధ్యం అని అలోచించి ఆ ఆలయాన్ని ఆణువణువు పరిశీలించి కొలతలు తీసుకున్నాడు. గుడి మధ్యలో నిలబడి ఏ గర్భగుడి వైపు చూసిన నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఇదే నమూనాతో థర్మకోల్తో గుళ్లను, కొవ్వొత్తులతో స్తంభాలను ఏర్పరిచి పరిశీలించారు. 


ఆలా మనోహర్ ఈ గుడి పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారని తెలిపారు. లింగంపై ఉన్న నీడ ఒక స్తంబానిది కాదని, నాలుగు స్తంభాల నీడ లింగంపై పడుతుందని తెలిపారు. కాంతి రెండువైపులా నుంచి ప్రసరిస్తుందని, నీడ పడే గర్భ గుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపులా నుంచి కాంతి వస్తుంది.ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుందని, ఆ పరివర్తనం అంత గర్భ గుడిలోని లింగంపై  ప్రతిఫలించేలా నిర్మాణం చేశారని తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: