మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులను మనము రోజూ చూస్తూ ఉండడం, కొన్ని వస్తువులతో పనులు చేయడం వంటి కారణాల వలన వాటిపై మనకు ఒకరకమైన ఇష్టం కలుగుతుంది. రాను రాను వాటితో ఎటువంటి ఉపయోగం లేకపోయినా సరే... వాటిని మనము పడేయకుండా అలాగే ఇంటిలోనే ఉంచుకుంటూ ఉంటాము.  కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇంటిలో ఏవైతే వస్తువులను మనము ఉపయోగించమో వాటితో సమస్య ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ వస్తువులను రాహువు, కేతువు మరియు శని అంటి పెట్టుకుని ఉంటాయట. దీనితో ఈ వస్తువులలో ఉన్న శని ప్రభావం మనపై  పడుతూ ఉంటుదంట. అందుకే మనకు ఉపయోగపడని వస్తువులను ఇంట్లో ఉంచకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఆ వస్తువులు ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం.

ఇత్తడి పాత్రలు: మామూలుగా ఒకప్పుడు అయితే వీటి వాడకం చాలా ఎక్కువగా ఉండేది. కానీ నేటి కాలంలో కాస్త తగ్గింది అని చెప్పాలి. ఈ ఇత్తడి పాత్రలను స్టోర్ రూం లోనే పెడుతుంటారు. ఇలా నిరుపయోగంగా మారిన ఈ వస్తులలో శని తిష్ట వేసుకుని కుర్చుంటాడట. ఈ విధంగా వీటిని ఉంచుకోవడం వలన మీ లైఫ్ లో ఇబ్బందులు కలుగుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ శని మనకున్న డబ్బును దూరం చేస్తుంది.

పాత బట్టలు: ఇంటిలో మనము వాడేసిన పాత బట్టలు, దిండ్లు, పరుపులు పనికి రాకపోయినా సరే వాటిని పడేయకుండా చాలా భద్రంగా స్టోర్ రూమ్ లో పడేస్తారు. ఇవి ఇలాగే ఉండడం వలన బుధ గ్రహం క్షీణించి పోతుంది. తద్వారా అది మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

తుప్పు పట్టిన వస్తువులు: ఏదో ఒక పనిగా ఇనుప వస్తువులను వాడుతూ ఉంటాము. అయితే వీటిని కొద్ది కాలం వాడిన తర్వాత అవి తుప్పు పట్టి పోతాయి. అయితే ఇలా తుప్పు అపట్టిన వస్తువులు ఉండడం వలన మనలో ఆందోళన మరియు ఒత్తిడి పెరుగుతుంది అని వాస్తుశాస్త్రం చెబుతోంది. కాబట్టి మీ ఇంట్లో ఏమైనా ఇనుప వస్తువులు ఉంటే వెంటనే పడేయండి.

కుట్టు మిషన్: కొందరి ఇళ్లల్లో కుట్టు మిషన్ లు ఉంటాయి. అయితే ఇవి కొంతకాలం వరకు బాగానే ఉంటాయి. అయితే చాలా కాలం తర్వాత మాత్రం పాడు అయిపోతాయి. ఇలా పాడైపోయిన  కుట్టు మిషన్ లను ఎటువంటి పరిస్థితిలో ఇంటిలో ఉంచకూడదు. ఒకవేళ వీటిని వాడకపోతే రాహువు మరియు శని ఉంటాయట. వీటి వలన ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయని తెలుస్తోంది.

ఇవి  మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులు కూడా ఇంట్లో వాడకుండా ఉంటే పడేయడం ఉత్తమం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: