సుజుకి మోటార్స్ నుండి రాబోతున్న సరికొత్త మోడల్ బర్గ్ మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ స్కూటర్ కావాలనుకునే వారు దేశవ్యాప్తంగా సుజుకి షోరూంలలో 5000 రూపాయలు అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 125 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బర్గ్ మ్యాన్ స్కూటర్ 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడింది. 


జూలైలో ఈ స్కూటర్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సుజుకి బర్గ్ మ్యాన్ 125 స్ట్రీట్ సుజుకి యాక్సిస్ 125 ఫీచర్స్ తోనే వస్తుంది. ఇంజిన్, సస్పెన్షన్, బ్రేకింగ్ మొత్తం సుజుకి 125 యాక్సిస్ స్కూటీ నుండి తీసుకున్నారు. ఈ బర్గ్ మ్యాన్ స్ట్రీట్ 85 బి.హెచ్.పి, 10 ఎన్.ఎం టార్క్ తో అందుబాటులో వస్తుంది.  


సుజుకి స్కూటర్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అందుకు తగినట్టుగానే కొత్త మోడల్స్ తో సుజుకి వస్తుంది. ఈ బర్గ్ మ్యాన్ సుజుకి కస్టమర్స్ కు సరికొత్త ప్రయాణపు అనుభూతి ఇచ్చేందుకు వస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: