యమహా నుండి పవర్ బైకులే కాదు స్కూటర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే స్కూటర్ విభాగంలో కూడా దూసుకెళ్లిపోతున్న యమహా నుండి సరిత్త స్ట్రీట్ ర్యాలీ స్పోర్ట్స్ స్కూటర్ ను రిలీజ్ చేయడం జరిగింది. అదే యమహా సిగ్నస్ రే జెడ్.ఆర్ స్ట్రీట్ ర్యాలీ. ఇండియన్ మార్కెట్ పై మంచి పట్టు సాధించాలని చూస్తున్న యమహా ఈ సరికొత్త స్ట్రీట్ ర్యాలీ స్కూటర్ ను ప్రత్యేకంగా తయారు చేసి ఇక్కడ రిలీజ్ చేసింది.  


ఇక దీని ధర విషయానికొస్తే.. 57,898 రూపాయల ఎక్స్ షోరూం ప్రైజ్ గా నిర్ణయించబడింది. యమహా నుండి వచ్చిన రే జెడ్.ఆర్ స్టాండర్డ్ స్కూటర్ తో పోల్చుకుంటే ఈ రే జెడ్.ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్పోర్ట్స్ డిజైన్ తో వచ్చింది. ఇక ఈ స్కూటర్ జూలై చివరి వారంలో అందుబాటులోకి రానుంది.


ఈ స్కూటర్ యొక్క ముందు విభాగం వింగ్ స్టైల్ ఫెయిరింగ్ అనగా రెక్కల ఆకరంగా తయారు చేయబడింది. 113 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ బ్లూ కోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 7.1 బి.హెచ్.పి పవర్ 8.1 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: