భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వాహనాల అమ్మకాలు క్షీణించిన తరువాత తాత్కాలిక ఒప్పందాలపై పనిచేసే కార్మికుల సంఖ్యను తగ్గించినట్లు రాయిటర్స్‌కు తెలిపింది. భారతదేశం  ఉత్పాదక ఉత్పత్తిలో దాదాపు సగం వాటా ఉన్న ఆటో పరిశ్రమ, గత దశాబ్ద కాలంలో దాని వృద్ది రేటు చాలా క్షీనించింది. వాహనాల అమ్మకాలు వేగంగా పడిపోతున్నాయి, తిరిగి పెరిగే సూచనలు కనిపించడంలేదు .


2019 తొలి  ఆరు నెలల్లో సగటున 18,845 మంది తాత్కాలిక కార్మికులను నియమించినట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6% లేదా 1,181 మంది తగ్గింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగ కోతలు పెరిగాయని కంపెనీ తెలిపింది. కంపెనీలో కోత విదించడం ఇదే మొదటిసారి. జపాన్ యొక్క సుజుకి మోటార్ కార్ప్ యాజమాన్యంలోని మారుతి సుజుకి, తన శాశ్వత శ్రామిక శక్తిని తగ్గించలేదని, గత సంవత్సరం నుండి  మార్చి చివరినాటికి  ఇది 15,892 గా ఉంది.  అయితే మరింత కోత చేయనున్నారా  అని చెప్పడానికి నిరాకరించింది.


ఈ సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో ఉత్పత్తిని 10.3% తగ్గించినట్లు గతంలో తెలిపింది. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో విక్రయించిన ప్రతీ రెండు  వాహనాల్లో ఒకటి ఉత్పత్తి గా చేసే మారుతి సుజుకి, జూలై 2018 తో పోలిస్తే జూలైలో అమ్మకాలు 33.5% క్షీణించి 109,265 వాహనాలకు చేరుకుంది అని సంస్థ యాజమాన్యం వెళ్ళడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: