ఎంతో ఆనందంగా పాపికొండల టూర్ కి బయల్దేరిన ప్రయాణికుల జీవితంలో అదే ఆఖరి రోజయ్యింది . పాపికొండల వయ్యారాలు , గోదావరి  అందాలు చూస్తూ సంతోషంగా గడుపుతున్న ప్రయాణికుల జీవితాలను చిదిమేసింది మృత్యువు . ఈ బోట్ ప్రమాదంలో  తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి . 


తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోట్  ప్రమాదంలో  39 మంది వరకు గల్లంతయ్యారు కాగా  నిన్నటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు . దేవీపట్నం వద్ద ఇవాళ మరో 5 మృతదేహాలను గుర్తించారు.  ప్రస్తుతం మృతుల సంఖ్య 31కి చేరుకుంది .అయితే ఈ ప్రమాదంలో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి .ఇంకా కొన్ని మృతదేహాల కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు  .అయితే ఆచూకీ లభించని మృతదేహాలు బోటులో ఇరుక్కుని ఉండవచ్చని ...అధికారులు అంచనా వేస్తున్నారు .


కాగా ప్రమాదంలో మునిగిపోయిన బోట్ గోదావరి నదిలో దాడ్పు 315  అడుగుల లోతు వరకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు .కాగా గోదావరిలో ఉన్న ప్రవాహం పరిస్థితుల నేపథ్యంలో తమకు 150  అడుగుల వరకు వెళ్ళటానికి మాత్రమే అనుమతి ఉందని ...అంతకు మించి  లోతుకు వెళ్లడం ఏమాత్రం క్షేమం కాదని నిపుణులు చెబుతున్నారు .అయితే బోట్ ని వెళ్ళిక్కితియ్యటం తమవల్ల కాదంటూ నేవి వర్గాలు కూడా  తెలిపాయి . ఇలాంటి ఆపేరేషన్స్ ని సమరవంతగా నిర్వర్తించే నేవీ అధికారి దశరథ్ సైతం ఇప్పుడు గోదావరిలో ఉన్న పరిస్థితిల్లో  బోట్ ని బయటకి తీయటం అసాధ్యం అని చెప్పేశారట . అయితే మిగిలిన మృత దేహాలను వెల్లిక్కి తీయటం అసాధ్యం అని చెప్పడటం తో మృతుల కుటుంబాలకి కనీసం చివరి చూపు కూడా దక్కేలా లేదు . దీంతో కుటుంబ సభ్యుల బాధ అరణ్యరోదనంగా మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: