మామూలు గా పులిహోర అంటే  ఏ నిమ్మకాయతోనో... లేక చింతపండుతోనో ,  అది లేకుంటే కొందరు ఉసిరికాయతో పులిహోర చేసుకుంటారు. మరికొందరు అటుకులతో పులిహోర చేసుకుంటారు. కానీ, వెరైటీగా టమోటాతో  పులిహోర చేసుకోవడం ఎప్పుడైనా విన్నారా.. నిజంగానే పులిహోర చేసుకుంటారట.. అది ఎలా చేసుకుంటారు.. టమోటా కాకుండా వెరైటీగా ఏదైనా వేసుకుంటారా అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాము. 


కావలసిన పదార్థాలు :

బియ్యం          : పావుకిలో 
టమోటాలు      : మూడు 
చింతపండు గుజ్జు : ఒక స్పూన్ 
పచ్చిమిర్చి         : ఒక నాలుగు 
సెనగ పప్పు        : కొద్దిగా 
మినపప్పు          : కొద్దిగా 
ఉప్పు                : సరిపడా 
ఎండుమిర్చి         : మూడు 
ఆవాలు               : స్పూన్ 
కరివేపాకు             : కొద్దిగా                
పసుపు                : కొద్దిగా 
కొత్తిమీర                : రెండు రెబ్బలు 


తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులో టమోటా ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను కొద్దిగా నీళ్లు వేసి ఉడక నివ్వాలి. ఆ మిశ్రమాన్ని చల్లార్చాక అందులో చింతపండు గుజ్జును చేర్చి ఆ మిశ్రమాన్ని మెత్తగా పేస్టూ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఉడికించిన అన్నాన్ని, టమోటా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మరో  ఫ్యాన్ పెట్టుకొని నూనె వేసి, ఆవాలు, మినపప్పు, మిర్చి, శనగపప్పు , కరివేపాకు అన్ని వేసి దోరగా అయ్యాక అన్నం మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తరువాత పైన కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచుకరమైన టమోటా పులిహోర రెడీ.. 



మరింత సమాచారం తెలుసుకోండి: